ఫోటో టాక్: మెగా ఫ్రెమ్ లో మెగా ఫ్యామిలీ

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ కుండే ప్రత్యేకతే వేరు. ఆ ఫ్యామిలిలో ఉన్నంతమంది హీరోలు మరే ఫ్యామిలోను లేరు. చిన్న పెద్ద స్టార్ హీరోలు ఆ ఫ్యామిలీలోనే ఉన్నారు. ఆఖరుకి మెగా ఫ్యామిలీనుండి ఒక హీరోయిన్ కూడా వచ్చింది. మెగాస్టార్ చిరు ని ఆసరాగా చేసుకుని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మెగా హీరోలు అనతికాలంలోనే స్వశక్తితో పైకి వచ్చి తమకంటూ ఒక స్టార్ స్టేటస్ ని ఏర్పరుచుకున్నారు. చిరంజీవి నీడ కింద చల్లగా ఉంటున్నారు. ఇక ఇప్పటికి చిరంజీవి హీరోగానే సినిమాల్లో కొనసాగుతున్నాడు. పవన్ మాత్రం రాజకీయాలనంటూ మెగా ఫ్యామిలీకి కాస్త దూరంగా ఉంటున్నారు కానీ… మిగతావాళ్ళు అంటే నాగబాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ అంతా సినిమాల్లోనే ఉన్నారు.

ఇక ఎప్పటికప్పుడు మెగా ఫ్యామిలి లో పండగ సెలెబ్రేషన్స్ దగ్గరనుండి ఫ్యామిలీ పార్టీలవరకు అందరు కలిసి చాలా సందడిగా చేసుకుంటారు. గత నెలలోనే హేలోవిన్ పార్టీలో సందడి చేసిన చిరు అండ్ ఫ్యామిలీ ఇప్పుడు దీపావళి పార్టీ ని ఎంజాయ్ చేశారు. చిరు ఫ్యామిలి చిన్న పిల్లలనుండి పెద్దవాళ్ళ వరకు ఈ దీపావళి ని బాగా సెలెబ్రేట్ చేఉకున్నారు. చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, కల్యాణ్ దేవ్, వరుణ్ తేజ్, నాగబాబు, అల్లు శిరీష్, సాయి ధరమ్ తేజ్ తదితరులు ఒకే చోటకు చేరారు. ఇక ఉపాసన, స్నేహ. సురేఖ, శ్రీజ, నీహారిక, అర్హ, అయాన్, శ్రీజ కూతురు, సుష్మిత పిల్లలు అంతా కలిసి ట్రెడిషనల్ డ్రెస్సులతో ఈ దీపావళిని సెలబ్రేట్ చేసుకున్నారు.

మరి మెగా ఫ్యామిలీ సెలెబ్రేషన్స్ లో ఒక్క పవన్ ఫ్యామిలీ తప్ప మిగతా మెగా ఫామిలీస్ అన్ని హాజరయ్యాయి. మరి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బాగా బిజీగా ఉండడంతో ఈ సెలెబ్రేషన్స్ లో పాల్గొనలేకపోయాడు. మెగా ఫ్యామిలీ మొత్తం మెగా పిక్ లో అంటే మెగా ఫ్రెమ్ లో కనబడితే మెగా అభిమానుల అందానికి అవధులేముంటాయ్ చెప్పండి. మరి తమ దీపావళి సెలెబ్రేషన్స్ తో పాటుగా మెగా ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ ని మెగా అభిమానులు ఎంజాయ్ చేశారు

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*