మెగాస్టారే అనేశాక ఇంకేముంది?

విజ‌య్ దేవ‌ర‌కొండ‌ ని స్టార్ హీరో అనాలా వ‌ద్దా అనే సందేహాల‌కి పుల్‌స్టాప్ ప‌డింది. సాక్షాత్తు మెగాస్టార్ చిరంజీవే… యువ క‌థానాయ‌కుడు విజ‌య్ స్టార్ అయిపోయాడ‌ని చెప్పుకొచ్చాడు. `గీత గోవిందం` స‌క్సెస్ సంబ‌రాల్లో చిరు ఈ మాట చెప్ప‌డంతో విజ‌య్ ఆనందానికి అవ‌ధుల్లేవు. రౌడీ ఫ్యాన్స్ అయితే అప్పుడే రౌడీ స్టార్ అన‌డం మొద‌లుపెట్టారు. విజ‌య్ మూడు సోలో హిట్ల‌తోనే స్టార్ హీరో రేంజ్‌కి ఎద‌గడం విశేష‌మే. ఆయ‌నలోని న‌ట‌న, యాటిట్యూడ్‌, మాస్‌కి న‌చ్చే ల‌క్ష‌ణాలే స్టార్‌ని చేశాయ‌ని చెప్పొచ్చు.

`ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం`తోనే విజ‌య్ దేవ‌ర‌కొండ పేరు అంద‌రికీ తెలిసిపోయింది. ఆ త‌ర్వాత వ‌చ్చిన `పెళ్లి చూపులు` స‌క్సెస్‌తో విజ‌య్ పేరు పొరుగు భాష‌ల్లోనూ వినిపించింది. అర్జున్‌రెడ్డి చిత్రంతో అయితే విజ‌య్‌కి పొరుగు భాష‌ల్లోనూ అభిమానులు ఏర్ప‌డ్డారు. మ‌ల‌యాళంలో `ప్రేమ‌మ్‌` విడుద‌లయ్యాక ఆ చిత్రం గురించి, అందులో న‌టించిన సాయిప‌ల్ల‌వి, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ త‌దిత‌ర తార‌ల గురించి ఇత‌ర భాష‌ల్లో ఎలా మాట్లాడుకున్నారో… అచ్చం అదే త‌ర‌హాలో `అర్జున్‌రెడ్డి` గురించి మాట్లాడుకున్నారు. విజ‌య్ ఆటిట్యూడ్‌కి మ‌రంత క్రేజ్ ఏర్ప‌డింది. అయితే అందులో ముద్దు స‌న్నివేశాలు ఉండ‌టంతో యువ‌త‌రం బాగా అట్రాక్ట్ అయ్యార‌ని… అదే విజ‌య్ ఫ్యామిలీ ఆడియెన్స్‌కి ద‌గ్గ‌రవ‌మ‌నండీ తెలుస్తుంద‌నే మాట‌లు వినిపించాయి. అలా అయితేనే స్టార్ అయిన‌ట్టనే అభిప్రాయాలు వినిపించాయి. `గీత గోవిందం`తో అదే చేశాడు విజ‌య్‌. ఈ చిత్రంలో మ‌సాలా విష‌యాలు కాకుండా, కేవ‌లం కామెడీతోనే ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశాడు. దాంతో ఫ్యామిలీ ఆడియెన్స్‌కి సినిమా విప‌రీతంగా క‌నెక్ట్ అయ్యింది. వ‌సూళ్లు ఓ పెద్ద స్టార్ సినిమాకి వ‌చ్చిన రేంజ్‌లో వ‌స్తుండ‌టంతో విజ‌య్ స్టార్ హీరో అన్నారంతా. చిరు కూడా అదే విష‌యాన్ని వేదిక‌పై చెప్పి విజ‌య్ స్టార్ అనే మాట‌కి ఆమోద ముద్ర వేసేశారు. చిరులాంటి ఓ మెగాస్టారే ఆ మాట అన‌గానే విజ‌య్ మొహం వెయ్యి ఓట్ల బ‌ల్బు రేంజ్‌లో వెలిగిపోయింది

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*