మెహ్రీన్ బాటలో మేఘా ఆకాష్!!

టాలీవుడ్ లో నటనతో అంతగా ఆకట్టుకోకపోయినా సినిమా ఆఫర్స్ మాత్రం పుష్కలంగానే వస్తున్న హీరోయిన్స్ లో మెహ్రీన్ పిర్జాదా ఒక్కరు. తెలుగులో నాని కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో అడుగు పెట్టిన ఈ బ్యూటీ పెద్దగా యాక్ట్ చేయాల్సిన పని లేకుండానే కెరీర్ ను సక్సెస్ గా లీడ్ చేస్తోంది.

ఆఫర్లకు మాత్రం లోటు లేదు….

నటన పరంగా సినిమాల్లో అంత గొప్పగా నటించకపోయిన మెహ్రీన్ కు ఆఫర్లకు మాత్రం లోటు లేదు. అయితే ఇప్పుడు మెహ్రీన్ బాటలోనే మరో హీరోయిన్ ఉంది. నితిన్ లై సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన మేఘా ఆకాష్.. కేవలం తన అందంతోనే నితిన్ రెండు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసింది. తాజాగా ఆమె మరో ఛాన్స్ కొట్టేసింది. సాయి ధరమ్ తేజ్ పక్కన హీరోయిన్ గా ఎంపికైంది.

నితిన్ తో రెండు సినిమాలు….

యాక్టింగ్ విషయంలో మెహ్రీన్ స్టయిల్లోనే సాగిపోతున్న మేఘాకు ఆఫర్లు కూడా అదే స్టయిల్లో వస్తుండటం విశేషం. మేఘా ఆకాష్ మొదట తమిళ్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ సినిమాలో హీరోయిన్ గా ఎంపికైంది. ఎనయ్ నోకి పాయం తోట సినిమాలో ధనుష్ పక్కన చేస్తోంది. అయితే ఆ సినిమా ఎప్పుడో స్టార్ట్ అయింది కానీ ఇంకా ఫినిష్ అవ్వకుండానే నితిన్ తో రెండు సినిమాలు చేసి సాయి ధరమ్ తేజ తో చేయటానికి రెడీ అయిపోయింది. డైరెక్టర్ గౌతమ్ మీనన్ తన యాక్టింగ్ కు గుర్తింపు వస్తుందని మేఘా ఆశిస్తొంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*