వద్దు.. వద్దు.. అంటూనే చేసిసింది..!

complaint on mehreen

మన సౌత్ హీరోయిన్స్ సినిమాలు ఓకే చేసే ముందే తమ పాత్ర ఎలా ఉంటుంది… అందులో ఎన్ని సాంగ్స్ ఉంటాయి… ఎంత గ్లామరస్ గా కనిపించబోతున్నాం… లాంటి విషయాలన్నీ తెలుసుకుని మరీ సైన్ చేస్తారు. ఒకవేళ సినిమాలో చనిపోయే పాత్రలు ఉంటే అసలు ఒప్పుకోరు. అయితే హీరోయిన్ మెహ్రీన్ అలాంటి పాత్రే ఒకటి చేసింది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వస్తున్న ‘కవచం’ సినిమాలో మెహ్రీన్ చిన్న పాత్ర చేసింది. ఇందులో కాజల్ మెయిన్ హీరోయిన్. చిన్న పాత్ర అయినా కథకు చాలా కీలకమైన పాత్ర అంట. అందులోనూ ఆమె ఈ సినిమాలో చనిపోతుందట. ఈమె మర్డర్ మిస్టరీ ఛేదించడం కోసం హీరో ఓ మిషన్ ప్రారంభిస్తాడు. అదే ‘కవచం’. ఇందులో శ్రీనివాస్ పోలీస్ పాత్రలో నటిస్తున్నాడు.

తెలిసిన వారు కావడంతో…

వాస్తవానికి మెహ్రీన్ ఈ పాత్ర చేయడానికి ఫస్ట్ ఒప్పుకోలేదట. తను సోలో హీరోయిన్ గా సినిమాల్లో చేస్తున్న టైంలో ఇటువంటి పాత్ర చేయడం కరెక్ట్ కాదని.. చేయను అని చెప్పిందంట. కానీ చివరికి చేయాల్సి వచ్చింది. కారణం ఫైనాన్షియర్లు. అవును… ఈ సినిమాకు పెట్టుబడి పెట్టిన వ్యక్తులు మెహ్రీన్ కు పరిచయస్తులు. అందుకే చేసిందని టాక్. పైగా భారీ మొత్తం ఆఫర్ చేయడంతో ఏమీ అనలేక ఓకే చేసిందట. రేపు రిలీజ్ అవుతున్న సినిమాను కొత్త డైరెక్టర్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసాడు. మరి ఈ సినిమా ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*