వాటి దెబ్బ ఈ సినిమాపై పడిందా..?

Mister Majnu satellite rights

అఖిల్ అక్కినేని… ‘తొలిప్రేమ’తో తొలి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న వెంకీ అట్లూరి దర్శకత్వంలో మిస్టర్ మజ్ను సినిమా చేస్తున్నాడు. దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల మీద ఫోకస్ పెట్టింది. అఖిల్ సరసన నిధి అగర్వాల్ నటించిన ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. ఇక వచ్చే నెల చివరి వారంలో విడుదలకు సిద్దమవుతున్న ఈ మిస్టర్ మజ్ను ప్రీ రిలీజ్ బిజినెస్ మొదలు పెట్టుకుంది. అందులో మొదటగా శాటిలైట్ హక్కులు అమ్ముడుపోయినట్లుగా తెలుస్తుంది. అయితే అఖిల్ మిస్టర్ మజ్ను మీద అఖిల్ గత చిత్రాల ఎఫెక్ట్ పడినట్లుగా అనిపిస్తుంది.

5 కోట్లకు దక్కించుకున్న జీ

అఖిల్ నటించిన ఆఖిల్, హలో చిత్రాలు అంతంతమాత్రంగా ఆడడంతో.. ప్రస్తుతం అఖిల్ మూడో చిత్రమైన మిస్టర్ మజ్ను మీద ఆ ఎఫెక్ట్ పడినట్లుగా శాటిలైట్ హక్కుల ధర చూస్తే తెలుస్తుంది. మరి ఇక్కడ దర్శకుడి తొలిప్రేమ సూపర్ హిట్ మ్యాజిక్ కూడా పని చెయ్యలేదు అనిపిస్తుంది. హలో చిత్రం అప్పుడే జీ ఛానల్ వారు 5 కోట్లకి శాటిలైట్ హక్కులను దక్కించుకుంటే.. ఇప్పుడు మిస్టర్ మజ్నుకి కూడా సదరు ఛానల్ 5 కోట్లకు కొట్టేసినట్లుగా టాక్. మిస్టర్ మజ్ను శాటిలైట్ హక్కుల కోసం పలు ఛానల్స్ పోటీపడినా చివరికి జీఛానల్ వారే 5 కోట్లకి మిస్టర్ మజ్ను హక్కులను లాగేసినట్లుగా చెబుతున్నారు.

హీరోహీరోయిన్లు ఫ్లాప్ లో ఉండటంతో…

ఇక అఖిల్ గత ఫ్లాప్స్, నిధి అగర్వాల్ సవ్యసాచి ఫ్లాప్ ఇలా సినిమా మీద అంచనాలు తగ్గడానికి కారణమైతే.. వెంకీ అట్లూరి దర్శకత్వం, తమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్, నిర్మాత ఖర్చు అన్నీ కలిపి సినిమా మీద హైప్ క్రియేట్ చేసేలా కనబడుతున్నాయి. అఖిల్ కి మార్కెట్ పరంగా ఎలాగున్నా.. అక్కినేని వారసుడు కాబట్టి అతని సినిమాలకు ఆటోమాటిక్ గా విడుదల సమయానికి రావాల్సిన క్రేజ్ అయితే వచ్చేస్తుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*