మోస్ట్ డిజైరబుల్’ లిస్ట్ లో టాలీవుడ్ హీరోస్!

ప్రముఖ ఇంగ్లీష్ డైలీ న్యూస్ పేపర్ టైమ్స్ ఆఫ్ ఇండియా 2017 సంవత్సరానికి గాను ‘మోస్ట్ డిజైరబుల్’ లిస్టును ప్రకటించింది. టాప్ 10 స్థానాల్లో టాలీవుడ్ నుండి ముగ్గురు స్టార్ హీరోస్ ఉన్నారు. బాహుబలి సినిమాతో ఇండియా వైడ్ ఫేమస్ అయిన ప్రభాస్ రెండవ స్థానంలో ఉండగా.. టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు 6వ స్థానంలో…దగ్గుబాటి రానా 7వ స్థానంలో నిలిచారు.

తొలి స్థానాన్ని…

మొదటి స్థానాన్ని బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ కైవసం చేసుకున్నాడు. అలానే 3వ స్థానం క్రికెటర్ విరాట్ కోహ్లీ…4,5 స్థానాల్లో బాలీవుడ్ హీరోస్ హృతిక్ రోషన్, సిద్ధార్థ్ మల్హోత్రాలు నిలిచారు. ఇక 10వ స్థానాన్ని మలయాళం హీరో దుల్కర్ సల్మాన్ కైవసం చేసుకున్నాడు. క్రేజ్, పాప్యులారిటీ ఆధారంగా 50 మందితో కూడిన మోస్ట్ డిజైరబుల్ జాబితాను ప్రతి ఏటా టైమ్స్ విడుదల చేస్తుంటుంది. ఈ ఏడాదిలో ప్రభాస్ కి టాప్ 10లో స్థానం దక్కటం అదృష్టం అనే చెప్పాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*