ఆ సీన్ చేస్తున్నప్పుడు ఏడ్చేశాం

మురగదాస్ – విజయ్ కాంబినేషన్ లో రూపొందిన చిత్రం ‘సర్కార్’. ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటించింది. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మాణ సారథ్యంలో రూపొందిన ఈ సినిమా ఈనెల 6న వరల్డ్ వైడ్ రిలీజ్ అవ్వబోతుంది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతున్న ఈ సినిమా కథ నాది అని ఓ రైటర్ కోర్ట్ లో కేసు వేశాడు. దానికి మురగదాస్ స్పందిస్తూ..లేదు ఈ కథ నాది అని ప్రెస్ మీట్ చెప్పాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమా అసలు రిలీస్ అవుతుందా..? లేదా..? అనుకున్నాం టైంలో… చివరికి కోర్ట్ లో ఇద్దరు రాజి పడి మురగదాస్ ఆ రైటర్ కి క్రెడిట్స్ తో పాటు కొంత డబ్బు కూడా ఇవ్వడానికి రెడీ అయ్యాడు.

అందరం ఏడ్చేశాం…

దీంతో ఆ ఎపిసోడ్ కి తెరపడింది. ప్రస్తుతం ‘సర్కార్’ సినిమా ప్రమోషన్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మురగదాస్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… చిత్రానికి సంబంధించిన ఓ బాధాకర సన్నివేశాన్ని వివరించారు. ఇందులో ఒక సన్నివేశం కోసం నటీనటులకు తాను వివరిస్తుంటేనే చాలా బాధపడ్డానని.. సన్నివేశం చిత్రీకరిస్తున్నప్పుడు తనతో సహా ఐదారుగురు కన్నీటి పర్యంతమయ్యారని ఆయన వివరించారు. ఆ ఎపిసోడ్ పూర్తయిన తరువాత ఒకరి మొహం ఒక్కరు చూసుకోలేదని.. సెట్ మొత్తం నిశ్శబ్దం ఆవరించిందని మురుగదాస్‌ తెలిపారు. తిరునల్వేలిలో అప్పుల బాధ భరించలేక ఒకే ఫామిలీలో నలుగురు నిప్పటించుకున్న సంఘటన ఆధారంగా ఆ సీన్ ను తెరకెక్కించాం అని మురగదాస్ తెలిపారు.

Sandeep
About Sandeep 6708 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*