మురుగదాస్ – విజయ్ ఏం చెయ్యబోతున్నారు!

తమిళ డైరెక్టర్ మురుగదాస్ సినిమాల్లో ఏదో ఒక మెసేజ్ ఉంటుందనేది అందరికీ తెలిసిందే. అందుకే ఆయన సినిమాలకు అన్ని భాషల్లోనూ పిచ్చ క్రేజ్. కానీ గత ఏడాది ఆయన డైరెక్ట్ చేసిన భారీ బడ్జెట్ చిత్రం స్పైడర్ విషయంలోనే బాగా తేడా కొట్టింది. ఇంతకుముందు తుపాకీ, కత్తి లాంటి అర్ధవంతమైన అదిరిపోయే కథలతో సినిమాని నడిపించిన మురుగదాస్ స్పైడర్ విషయంలో ఆయన అనుకున్న సక్సెస్ రాలేదు. స్పైడర్ తర్వాత మురుగదాస్ మళ్లీ తనకి బాగా కలిసొచ్చిన కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో సర్కార్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఎందుకంటే వారి కాంబోలో గతంలో వచ్చిన సినిమాలు బ్లాక్ బస్టర్స్ కావడం అలాగే.. విజయ్ గత సినిమా మెర్సల్ అనుకోకుండా బంపర్ హిట్ అయ్యింది.

రాజకీయ నేపథ్యంలో కథ..

ఇక ఇప్పుడు మురుగదాస్ – విజయ్ కాంబోలో వస్తున్న సర్కార్ సినిమా పొలిటికల్ బ్యాగ్డ్రాప్ లో ఉండబోతుందని సర్కార్ ఫస్ట్ లుక్ చెప్పకనే చెప్పేసింది. ఆ పోస్టర్ మీద కాంట్రవర్సీ నడిచినా… తరవాత సద్దుమణిగింది. ఇక సర్కార్ మూవీ కథలో ట్విస్ట్ ఒకటి ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది. ఆ ట్విస్ట్ ఏమిటంటే విదేశాల నుండి వచ్చిన హీరో విజయ్ ఇక్కడ ఇండియాలోని రాజకీయ వ్యవస్థ చూసి షాక్ అవడమే కాదు… ఆ రాజకీయ వ్యవస్థను సమూలంగా మార్చెయ్యాలనే ఉద్దేశ్యంతో సీఎం (రాధా రవి)ని టార్గెట్ చేసి తనకున్న తెలివితేటలతో గద్దె దించేసి, తన మనిషిని సీఎం చేసెయ్యడం…. అలాగే తన సీఎం ఈ రాజకీయ వ్యవస్థను మార్చడానికి విజయ్ ఎలాంటి సలహాలు ఇచ్చాడనేది సర్కార్ కథగా చెబుతున్నారు.

సర్కార్ పై కన్నేసిన టాలీవుడ్ హీరోలు

ఇక ఈ సినిమాలో మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ కాగా… సీఎం గా యాక్ట్ చేస్తున్న రాధా రవి కూతురుగా వరలక్ష్మి శరత్ కుమార్ నెగెటివ్ షేడ్స్ లో పొగరెక్కిన అమ్మాయి పాత్రలో నటిస్తోంది. మరి భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సర్కార్ సినిమాకి ప్రి రిలీజ్ బిజినెస్ భారీగా జరుగుతున్నట్టుగా టాక్. ఇప్పటికే మురుగదాస్ సర్కార్ సినిమా మీద అప్పుడే టాలీవుడ్ హీరోల కన్ను పడిందనే టాక్ నడుస్తుంది. ఇక మురుగదాస్ తెరకెక్కించిన కోలీవుడ్ సినిమాలెన్నో తెలుగులో సూపర్ హిట్స్ అయ్యాయి కదా అందుకే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*