బన్నీ నిజంగానే పని రాక్షసుడు!!

హీరోకి కావాల్సింది అందంతో పాటు టాలెంట్ కూడా. కానీ మన టాలీవుడ్ ఇండస్ట్రీ లో కొంత మంది హీరోలు నటించకుండానే ఆలా కానిచేస్తుంటారు. కానీ ప్రేక్షకులు మాత్రం వారికి టాలెంట్ ఉంటేనే ఎంకరేజ్ చేస్తారు. వారికి బ్యాక్ నుండి ఎంత సపోర్ట్ ఉన్నా కానీ ఆడియెన్స్ లైక్ చేసేది వారి టాలెంట్ ని చూసే.

కొత్తదనం చూపేందుకు…..

మెగా ఫామిలీ నుండి చాలా మంది హీరోలున్నారు. అందులో ముఖ్యంగా బన్నీ కష్టపడే గుణాన్ని ఎవరైనా చూస్తే నిజంగా హీరో అవ్వాలంటే కష్టమే అనే మాట రాకుండా ఉండదు. తెరపై వారు ఏం చేసిన మనకి ఈజీగా అనిపిస్తుంటది. కానీ వారు తెర వెనుక ఎంత కస్టపడి చేస్తారో మనకి తెలీదు. డాన్స్ లు కానీ..ఫైట్స్ విషయంలో కానీ వారు ఎంత కష్టపడ్డాతారో వారికే తెలుసు. అలానే బన్నీ తన ప్రతి సినిమాలో డ్యాన్స్ విషయంలో ఎదో ఒక కొత్త దనాన్ని చూపించడం అలవాటే.

ఆ సాంగ్ కోసం….

‘నా పేరు సూర్య’ సినిమా లో ఓ సాంగ్ కోసం బన్నీ కష్టపడిన విధానం చూస్తే యాంటీ ఫ్యాన్స్ కూడా తనకి ఫ్యాన్స్ అయ్యిపోతారు. లవర్ ఆల్సో ఫైటర్ ఆల్సో పాట కోసం చేసిన ఆ మూమెంట్స్ కి సంబందించిన బి హైండ్ సీన్స్ వీడియోను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఆ సాంగ్స్ లో బన్నీ మతిపోగొట్టాడనే చెప్పాలి. అందులో క్యాప్ ట్రిక్స్ స్టెప్స్ తో బన్నీ ఎంత కష్టపడ్డాడో చూస్తే మీకే అర్ధం అవుతుంది. దాదాపు మూడు నెలలు కష్టపడి నేర్చుకొని బన్నీ ఆట్రిక్స్ చేశాడట. అయితే మేకింగ్ లోనే ఇంత స్టైలిష్ గా చేస్తే ఇంకా ఫుల్ సాంగ్ లో ఎంత బాగా చేసుంటాడో తెలియాలి అంటే రేపటివరకు ఆగక తప్పదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1