ఈ సినిమాతో బన్నీకి ఇబ్బందులు!

రెండుమూడు నెలల క్రితం నుండి ఈ సమ్మర్ లో పెద్ద సినిమాలు మూడు రిలీజ్ అవుతాయి అనుకున్నాం. అనుకున్నట్టుగానే రెండు పెద్ద సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ కూడా అయిపోయాయి. ఇంకా మూడవ సినిమా అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’ రిలీజ్ కి రెడీ గా ఉంది. ఈ సినిమాకు అంతా లైన్ క్లియర్ అనుకున్నారు. ఆల్రెడీ రిలీజ్ అయిన రెండు సినిమాలు ‘రంగస్థలం’, ‘భరత్‌ అనే నేను’ చల్లబడ్డాయి కనుక ‘నా పేరు సూర్య’కి తిరుగు వుండదని ఆ చిత్ర నిర్మాతలు, బయ్యర్లు భావించారు.

అనుకోని అతిధిగా…

కానీ అనుకోని అథితిగా హాలీవుడ్ మూవీ ‘అవెంజర్స్‌’ వచ్చింది. వస్తే వచ్చింది కానీ అత్యద్భుత వసూళ్లు సాధిస్తూ వుండడంతో దీనిని తీసివేయడానికి, షోలు తగ్గించడానికి మల్టీప్లెక్సులు నిరాకరిస్తున్నాయి. దీంతో మల్టీప్లెక్స్‌ లో ‘నా పేరు సూర్య’ షోలకి గండి పడుతోంది. చిన్న మల్టీప్లెక్స్‌ ల నుండి పెద్ద మల్టీప్లెక్స్‌ దాకా ఎందులోను ‘నా పేరు సూర్య’కి ఎక్కువ షోలు దొరకడం లేదు.

కొంత వరకూ…..

సింగిల్‌ స్క్రీన్లలో తొలి వారం అయిదు షోలు వేసుకోవడానికి ఉభయ రాష్ట్రాల నుంచి పర్మిషన్‌ తెచ్చుకున్నారు ‘నా పేరు సూర్య’ టీం. ఈ అయిదు షోల టాక్టిక్‌ ఇంతవరకు సత్ఫలితాలనివ్వలేదు. కానీ అవెంజర్స్‌ వల్ల వస్తోన్న మల్టీప్లెక్సుల రెవెన్యూ నష్టాన్ని కాస్తయినా భర్తీ చేసుకోవడానికి ఇది పనికొస్తుందని ఆశిస్తున్నారు బన్నీ అండ్ టీం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*