అమ్మడు మాములు లక్కీ గర్ల్ కాదుగా

ఇప్పుడు టాలీవుడ్ లో కొత్త హీరోయిన్స్ కోసం దర్శకనిర్మాతలు వెంపర్లాడే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే నయనతార, కాజల్ అగర్వాల్, సమంత, తమన్నా వంటి వాళ్ళు సీనియర్ హీరోయిన్స్ గా మారిపోవడంతో.. కొత్త అందాలను వెతికే పనిలో స్టార్స్ ఉన్నారు. అయితే కాజల్, సమంత వాళ్ళు సైడ్ అవ్వగానే పూజ హెగ్డే లీడ్ లోకొచ్చేసింది. ప్రస్తుతం స్టార్ హీరోలందరిని చుట్టేస్తున్న పూజ తర్వాత మళ్ళీ స్టార్ హీరోల ఆప్షన్ ఎవరు అనే దానిమీద చర్చ జరుగుతూనే ఉంది. ఇక అనుపమ, అను ఇమ్మాన్యువల్, రాశి ఖన్నా వంటి హీరోయిన్ కుర్ర హీరోలకే పరిమితమవుతున్నారు. ఇక ఇంతవరకు మలయాళ హీరోయిన్స్ టాలీవుడ్ ని ఏలేస్తుంటే.. తాజాగా కన్నడ నుండి వచ్చిన రష్మిక ఒక్కసారిగా క్రేజీ హీరోయిన్ అయ్యింది. మరోపక్క నన్ను దోచుకుందువటే తో నాభ నటేష్ తెలుగు ప్రేక్షకుల మనసులను దోచేసింది.

నన్ను దోచుకుందువటే సినిమాలో సిరి గా, మేఘనగా అదరగొట్టిన నాభ నటేష్ కి ఆ సినిమాలో నటనకు, స్క్రీన్ ప్రెజెన్స్ కి, గ్లామర్ కి మంచి మార్కులే పడ్డాయి. నాభ నటేష్ స్క్రీన్ ప్రెజెన్స్ కి అయితే అందరూ ముగ్దులైపోతున్నారు. ఇప్పటికే రష్మిక కన్నడ నుండి వచ్చి ఇక్కడ కుంపటి పెట్టింది. ఇక తాజాగా నాభ నటేష్ కూడా నన్ను దోచుకుందువటే తో దర్శకనిర్మతలను పడేసింది. సినిమా అలా విడుదలైందో లేదో.. సినిమాకి వచ్చిన టాక్ తో సంబంధం లేకుండా… (యావరేజ్ టాక్ వచ్చినప్పటికీ) అందులో నటించిన నాభ నటేష్ ని ఆకాశానికెత్తేస్తున్నారు. ఇక అమ్మడు టాలీవుడ్ లో బిజీ అవడం కన్ఫర్మ్ అనుకునేలోపు.. నాభ నటేష్ ఒక అవకాశం పట్టేసినట్లుగా వార్తలొస్తున్నాయి.

దర్శకుడు వి ఆనంద్ దర్శకత్వంలో రవి తేజ హీరోగా వస్తున్న సినిమాలో నాభ నటేష్ హీరోయినా గా నటించబోతున్నట్లుగా సమాచారం. అయితే త్వరలోనే ఈ వార్తకు సంబంధించి అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు. రవి తాళ్లూరి నిర్మించనున్న ఈ చిత్రం లో రవితేజ డ్యూయెల్ రోల్ చెయ్యబోతున్నాడు. నిజంగా నాభకి ఇది బంపర్ ఆఫరే. నన్ను దోచుకుందువటే సినిమాలో ప‌క్కింటి అమ్మాయిలా క‌నిపిస్తూనే, మంచి అభిన‌యం కనబర్చిన నాభ నటేష్ వెంటనే తెలుగులో ఒక హీరో పక్కన అవకాశం రావడం మాత్రం నాభ నటేష్ అదృష్టమని చెప్పాలి. ప్రస్తుతం అమర్ అక్బర్ అంటోని సినిమాతో బిజీగా వున్న రవితేజ ఈ సినిమా షూటింగ్ పూర్తికాగానే వి ఆనంద్ దర్శకత్వంలో కొత్త సినిమాని మొదలుపెడతాడు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*