మరో కన్నడ భామ సెట్ అయినట్లేనా..?

నిన్న విడుదలైన నన్ను దోచుకుందువటే సినిమా మిక్స్డ్ టాక్ తో థియేటర్స్ లో రన్ అవుతుంది. సుధీర్ బాబు తన ఓన్ ప్రొడక్షన్ లో హీరోగా… ఆర్.ఎస్. నాయుడు అనే కొత్త డైరెక్టర్ తో ఈ సినిమాని నిర్మించాడు. మరి ఈ సినిమాకి మొదటి షోకే ప్రేక్షకులు, క్రిటిక్స్ నుండి మిక్స్డ్ టాక్ వచ్చింది. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ కామెడీతో అదరగొట్టేస్తుండగా… సెకండ్ హాఫ్ కాస్త సాగదీతగా ఫీల్ అవడం వల్లనే సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయితే ఈ సినిమాలో సుధీర్ బాబు సరసన నభా నటేష్ అనే కన్నడ భామ తెలుగు తెరకు పరిచయం అయ్యింది. నభా నటేష్ మాత్రం టాలీవుడ్ మొదటి సినిమాకే చక్కని పాత్ర దక్కించుకుంది. సిరి పాత్రలో నభా నటేష్ చెలరేగిపోయింది. అచ్చం బొమ్మరిల్లులో హాసిని తరహాలో అనిపించే సిరిగా చక్కగా ఒదిగిపోయింది. గ్లామర్ పరంగా కొన్ని మైనస్ లు ఉన్నాయి కాబట్టి ఇలాంటి పెరఫార్మన్స్ బేస్డ్ పాత్రలు అయితేనే తనకు బాగా సూట్ అవుతాయి. గొప్ప అందగత్తెమీ కాదు కానీ ఆకట్టుకునే లక్షణం ఉంది. అందమైన చూపులతో… ఆకర్షణీయమైన దేహంతో నభా నటేష్ ఆకట్టుకుంది.

టాలీవుడ్ లో సెట్ అయినట్లేనా..?

దర్శకుడు సిరి పాత్రను తీర్చిదిద్దిన తీరుకి సెలెక్ట్ చేసుకున్న నభ నటేష్ బాగా సింక్ అయ్యింది. ఇక మేఘన కన్నా సిరి పాత్రలోనే నభా నటేష్ బాగా హైలెట్ అయ్యింది. నభా నటేష్ స్క్రీన్ ప్రెజెన్స్ కి మంచి మార్కులే పడుతున్నాయి. పాత్ర కూడా బాగుండటంతో నభా ప్రేక్షకులపై బలమైన ముద్రే వేస్తుంది. అసలు హీరోయిన్ నభా నటేష్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మరి నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగులోకి మరో కన్నడ భామ డీసెంట్ ఇచ్చిన ఎంట్రీ… మిగతా భామలకు నిద్ర లేకుండా చేస్తుంది. ఇప్పటికే ఛలో సినిమాతో మరో కన్నడ భామ రష్మిక మందన్న మిగతా తెలుగు హీరోయిన్స్ కి చుక్కలు చూపెడుతుంది. తాజాగా నభా నటేష్ కూడా ఈ సినిమాతో మరిన్ని తెలుగు అవకాశాలు వచ్చినా రావచ్చు. మరి కొత్త అందాలను ఊరికే ఎవరు వదలరు కదా.. అందులోనూ పరభాష హీరోయిన్స్ మీదున్న మోజు మామూలుది కాదాయే…!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*