అందుకే సినిమా తీసా: నాగ అశ్విన్

మహానటి సావిత్రి జీవిత చరిత్రను ఆవిష్కరించాలంటే ఎంతో ధైర్యం ఉండాలి. సీనియర్ డైరెక్టర్స్ దాసరి నారాయణరావు..రాఘవేంద్ర రావు లాంటి స్టార్ డైరెక్టర్స్ ఐతే ఇటువంటి సినిమాకు న్యాయం చేయగలుగుతారు. కానీ కేవలం ఒక సినిమా ఎక్సపీరియన్స్ తో నాగ అశ్విన్ ‘మహానటి’ సినిమా తీయడానికి ధైర్యం చేసాడు.

ఇటువంటి అద్భుత కావ్యాన్ని తీయడమే కాకుండా విడుదలైన తర్వాత అందరి మనసులను ఒక్కసారిగా గెలుచుకున్నాడు నాగి.. ఇంతకీ అంత ధైర్యం నాగికి ఎలా వచ్చింది? ఈ ప్రశ్నకు సమాధానం ఆయన మాటల్లోనే.. ” మహానటి సావిత్రి గారి మీద సినిమా తీయాలని ఎప్పటి నుండో అనుకునే వాడిని కానీ కొంచం అనుభవం వచ్చిన తర్వాత తీస్తే బాగుంటుంది అని అనుకున్న.

రెండు, మూడు సినిమాల తర్వాత హిట్లు, ప్లాపులు లాంటి లెక్కలు వస్తే.. అది వేరేలా ఉంటుంది. దాని ప్రభావం నాపై పడుతుందేమో అనుకున్న . అందుకే వేరే వాళ్లు తీసే లోపే నేనే తీసేస్తే బాగుంటుంది కదా అనుకుని సినిమా స్టార్ట్ చేశా అని చెప్పాడు నాగి”.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1