కళ్యాణ్ జ్యువెలర్స్ యాడ్ పై స్పందించిన నాగ్

అక్కినేని నాగార్జున యాక్టర్ గానే కాకుండా ఓ ప్రముఖ జువెలర్స్ బ్రాండుకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు. గత కొన్నేళ్ల నుండి నాగ్ కళ్యాణ్ జువెలర్స్ బ్రాండుకు ప్రచార కర్తగా ఉన్నారు. ప్రస్తుతం ఈ జువెలరీ బ్రాండుకు తెలుగు రాష్ట్రాల్లో మంచి పాపులారిటీ వచ్చింది. దాంతో వారు నాగార్జునతో అనేక యాడ్స్ తీసి తమ బ్రాండ్ ను జనాలలోకి తీసుకుని వెళ్తున్నారు.

వివాదాస్పదం కావడంతో

ఇక లేటెస్ట్ ఈ సంస్థ కోసం నాగ్ ఓ యాడ్ లో యాక్ట్ చేయగా అది ప్రస్తుతం వివాదాస్పదమైంది. తెలుగులోనే కాదు హిందీ, తమిళం, మలయాళంలో అమితాబ్ బచ్చన్.. తమిళంలో ప్రభు చేసిన ప్రకటన కూడా వివాదానికి దారి తీసింది. ఆ యాడ్ లో బ్యాంకింగ్ సిబ్బందిని తప్పుగా చూపించారన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. వివాదం మరీ పెద్దది కావడంతో కళ్యాణ్ జువెలర్స్ సంస్థ ఆ యాడ్ ను వెనక్కి తీసుకుంది. ఇక లేటెస్ట్ గా ఈ వివాదంపై నాగ్ కూడా స్పందించారు.

సారి చెప్పారన్న నాగ్

తనకు కళ్యాణ్ సంస్థ నుండి ఒక లెటర్ వచ్చిందని అందులో.. ఈ యాడ్ ను వెనక్కి తీసుకుంటున్నామని..ఇందులో మిమ్మల్ని యాక్ట్ చేయించినందుకు సారీ చెబుతున్నాం అని ఆ లెటర్ లో ఉంది. మీడియా వారు అడిగిన ప్రశ్నకు గాను నాగ్ ఈ విషయం చెప్పారు. ఇక నేను ఈ యాడ్ తో నటించక ముందు అమితాబ్ బచ్చన్.. ప్రభు ఇదే ప్రకటన చేశారని.. వాళ్ల తర్వాతే తాను నటించానని చెప్పారు. ఈ వివాదం పక్కన పెడితే తనకు ఈ యాడ్ బాగా నచ్చింది. ఇందులో తానూ కొత్తగా కనిపించానని చెప్పారు నాగ్.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*