నాని – నాగ్ సినిమా టైటిల్ ఇదే..!

గత కొంత కాలం నుండి టాలీవుడ్ లో మల్టీస్టారర్ల గాలి వీస్తుంది. ఈ కోవలోనే నాగార్జున – నాని కలయికలో కొన్ని నెలల కిందటే ఒక సినిమా మొదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి దాదాపు టాకీ పార్ట్ పూర్తయింది. వచ్చే నెలలో ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ చేసి వినాయక చవితి కానుకగా సెప్టెంబరు 12న విడుదల చేయాలనుకుంటున్నారు. త్వరలోనే ఫస్ట్ లుక్ తో పాటు టీజర్, ట్రైలర్ ను లాంచ్ చేయనుంది టీం. అయితే ఇప్పటివరకు ఈ సినిమాకు టైటిల్ ఫిక్స్ చేయలేదు. చాలా టైటిల్స్ అనుకున్న అవి ఏమీ ఫైనలైజ్ కాలేదు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు ఓ టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. అక్కినేని నాగేశ్వరరావు కెరీర్లో మైలురాయిగా నిలిచిన ‘దేవదాసు’ సినిమా పేరునే దీనికి పెడుతున్నారట.

ఇద్దరి పేర్లు కలిసొచ్చేలా…

ఇందులో హీరోల పేర్లు దేవ, దాసు. అందుకే టైటిల్ కూడా ‘దేవదాసు’ అనే ఫిక్స్ చేసారు యూనిట్. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నాగ్ డాన్ పాత్రలో..నాని డాక్టర్ పాత్రలో కనిపించనున్నారు. నాగ్ సరసన ‘మళ్లీరావా’ ఫేమ్ ఆకాంక్ష సింగ్ నటిస్తోంది. నానికి జోడీగా ‘ఛలో’ భామ రష్మిక మందన్నా కనిపిస్తుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*