ఆఫీసర్ వెనుక ఇంత ఉందా..?

శివ సినిమా తర్వాత మళ్లీ నాగ్.. రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో ‘ఆఫీసర్’ సినిమా చేశాడు. ఈ సినిమా రేపు రిలీజ్ కానుంది. దానికి సంబంధించి నాగ్ ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు వివరించారు. ఈ సినిమాలో తండ్రి – కూతుళ్ల ఎమోషన్ నన్ను కట్టిపడేసిందని, అందుకే నేను ఈ సినిమాను ఒకే చేసానని చెప్పారు. ముక్కుసూటితనం, నిజాయతీ, వ్యవస్థపై గౌరవం ఉండే శివాజీరావు అనే పోలీస్ ఆఫీసర్ కథ ఇది అని వివరించారు.

కావాల్సినంత వాడుకోండి…

వర్మకు నేను ఎటువంటి షరతులు విధించలేదని, కాకపోతే తనలోని నైపుణ్యాలన్నింటినీ వాడుకోమన్నానని చెప్పానని, అది షరతు కాదని అన్నారు. మొదటి నుండి నా సినీ ప్రయాణం అంతా రిస్కులతో సాగిందని, ప్రతి సినిమాకు టెన్షన్ పడతాను అని అందుకే నాకు జుట్టు త్వరగా ఊడిపోతుందని చమత్కరించారు.

రజినీ చేయాల్సిన సినిమా..

లేటెస్ట్ గా ధనుష్ మొదటి ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ఓ కథ చెప్పాడని ఆ సినిమాను నన్ను చేయమని ధనుష్ అడుగుతున్నాడని తెలిపారు. వాస్తవానికి ఆ కథ రజినీతో చేయించాలనుకున్నా అతను రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల ఆ కథను నన్ను చేయమని ధనుష్ కోరాడని అయన అన్నారు.

Sandeep
About Sandeep 6914 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*