తమిళ ఇండస్ట్రీపై కన్నేసిన నాగ్..!

కింగ్ నాగార్జున ప్రస్తుతం టాలీవుడ్ లో సినిమాలతో పాటు బాలీవుడ్ లో కూడా ఓ సినిమా చేస్తున్నాడు. అయితే నాగ్ కన్ను ఇప్పుడు తమిళ ఇండస్ట్రీ పైన పడింది. తమిళంలో నాగ్ ఓ సినిమా ఒప్పుకున్నాడట. త్వరలోనే అది సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు. దానికి డైరెక్టర్ ఎవరో కాదు రజనీకాంత్ అల్లుడు ధనుష్.

ధనుష్ దర్శకత్వంలో…

ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నిన్ననే స్టార్ట్ అయింది. త్వరలోనే ఆ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నాడు నాగ్. ప్రస్తుతం తెలుగులో ‘దేవదాస్’ తో పాటు బాలీవుడ్ లో ‘బ్రహ్మాస్త్ర’ మూవీలో నటిస్తున్నాడు నాగ్. వీటితో పాటు కోలీవుడ్ లో ధనుష్ డైరెక్షన్ లో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ధనుష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నాగ్ తో పాటు తమిళ నటులు శ్రీకాంత్, ఎస్ జే సూర్య, శరత్ కుమార్ కూడా కీలకపాత్రలు పోషించబోతున్నారు.

20 నిమిషాలు మాత్రమే…

ఇక హీరోయిన్స్ గా అదితిరావు హైదరి, మేఘా ఆకాష్ కనిపించనున్నారు. అయితే ఇందులో నాగ్ ది ఫుల్ లెంగ్త్ పాత్ర కాదట. 20 నిమిషాలు మాత్రమే కనిపించనున్నాడని టాక్. తన గెటప్ కూడా చాలా కొత్తగా ఉంటుందనే విషయాన్ని నాగ్ ఇప్పటికే బయటపెట్టిన విషయం తెలిసిందే. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1