నాగ్ ట్వీట్ తో ఇబ్బందుల్లో పడ్డ `చిల‌సౌ`..!

Akkineni Nagarjuna to act in Manmadhudu 2

ఈవారం రిలీజ్ అయిన రెండు సినిమాల గురించి దాని మేకర్స్ ఒక‌రి సినిమా గురించి మ‌రొక‌రు పొగ‌డటం నిజంగా మంచి విషయమే. వీరు ఏ ఇంటర్వూస్ కి, ప్రెస్ మీట్స్ కి వెళ్లినా ఒకరి సినిమా గురించి ఒకరు పొగుడుకుంటున్నారు. గత శుక్రవారం విడుదలైన ‘చిలసౌ’, ‘గూఢ‌చారి’ సినిమాలు మంచి టాక్ తో పాటు క్రిటిక్స్ సైతం మెచ్చుకోవడంతో రెండు సినిమాలు సక్సెస్ దిశగా పయనిస్తున్నాయి. కాకపోతే ‘గూఢ‌చారి’కి వ‌సూళ్లు బాగున్నాయి.

చి.ల.సౌ ను దాటేసిన గూఢచారి

యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం మాస్ ఆడియన్స్ తో పాటు మల్టీప్లెక్స్ జనాలకి నచ్చడంతో కలెక్షన్స్ జోరు కొనసాగిస్తోంది. ఓవర్సీస్ లో అయితే ‘చిల‌సౌ’ సినిమాను ‘గూఢ‌చారి’ దాటేసింది. ఈ నేపథ్యంలో నాగ్ చేసిన ట్వీట్ `చిల‌సౌ`ని మ‌రింత ఇబ్బందుల్లో నెట్టింది. ‘గూఢ‌చారి’ సినిమాను చూసిన నాగ్ ఈ సినిమా చాలా బాగుంది..అడివి శేష్ వర్క్ బాగుందని ట్వీట్ చేయడంతో ఆ ట్వీట్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది.

మేనకోడలు నటించినందునేనా..?

ఈవారం నాగ్ బ్యానర్ నుండి అంటే అన్నపూర్ణ స్టూడియోస్ నుండి `గూఢ‌చారి` కి పోటీగా ‘చిల‌సౌ’ని దింపారు. తమ సొంత బ్యానర్ లో రిలీజ్ అయిన సినిమాను ప్రమోట్ చేయాల్సింది పోయి..బయట సినిమాను ప్రమోట్ చేయడం కొంచం ఆశ్చర్యం కలిగించే విషయం. కాకపోతే నాగ్ మాత్రం నిజాయ‌తీగా, నిస్ప‌క్ష‌పాతంగా ‘గూఢ‌చారి’ని మెచ్చుకోవ‌డం గొప్ప విషయమే. ఇక్కడ నాగ్ ఇలా చేయడానికి కారణం ఒకటి ఉంది. ‘గూఢ‌చారి’లో తన మేనకోడలు సుప్రియ న‌టించింది. చాలా కాలం తర్వాత ఆమె సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వడమే కాకుండా యాక్టింగ్ తో కుమ్మేయడంతో నాగ్ ఆలా ట్వీట్ చేసి ఉంటాడని అంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*