వాళ్ల మధ్యలో అల్లుడు ఇరుక్కుంటాడా..?

కేరళలో వచ్చిన వరదల కారణంగా శైలజ రెడ్డి అల్లుడు రీ రికార్డింగ్ సకాలంలో జరక్కపోవడంతో… వచ్చే శుక్రవారం విడుదల కావాల్సిన ఈ సినిమా తప్పుకుంది. నాగ చైతన్య – మారుతీ కాంబోలో అను ఇమ్మాన్యువల్ హీరోయిన్ గా రమ్యకృష్ణ పవర్ ఫుల్ అత్తగా నటిస్తున్న ఈ మూవీ రెండు నెలల క్రితమే ఆగస్టు 31న విడుదల తేదీ ఫిక్స్ చేసుకుంది. అందులోనూ నాగ చైతన్య సవ్యసాచి సినిమా మీద కన్నా ఎక్కువగా శైలజ రెడ్డి అల్లుడు మీద ఆశలు పెట్టుకున్నాడు. కానీ శైలజ రెడ్డి ఆర్ ఆర్ సకాలంలో పూర్తి కాకపోవడంతో.. ఈ సినిమా వాయిదా పడింది. అయితే మంచి డేట్ ని మిస్ చేసుకున్న ఈ సినిమా మళ్లీ పక్కాగా మంచి డేట్ సెట్ చేసుకోవడానికి తర్జన భర్జన పడుతుంది.

రెండు సినిమాలు ఉండటంతో…

ఎందుకంటే సెప్టెంబర్ లో అన్ని డేట్స్ ని మీడియం బడ్జెట్ సినిమాలు ఆక్రమించేశాయి. ఒక్క వినాయక చవితి డేట్ కే సమంత యూ-టర్న్, సుధీర్ బాబు నన్ను దోచుకుందువటే సినిమాలు విడుదల కాబోతున్నాయి. మరి శైలజ రెడ్డి అల్లుడు సినిమా కూడా ఆ డేట్ మీదే కన్నేసినట్లుగా వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం సమంత మూడు సినిమాల హిట్స్ తో ఫుల్ గా జోరు మీదుంది. ఇక సమ్మోహనం హిట్ తో సుధీర్ బాబు నన్ను దోచుకుందువటే సినిమా మీద మంచి అంచనాలే ఉన్నాయి. మరి సెప్టెంబర్ 13న నాగ చైతన్య కూడా శైలజ రెడ్డి అల్లుడుతో దిగితే కాస్తా ప్రాబ్లమ్.

ఇక తప్పదనుకుని…

మారుతీ సినిమాలు క్లిక్ అయితే ఓకె.. లేదంటే కనీసం యావరేజ్ కాకుండా ప్లాప్ అవుతాయి. మరి సమంతకి, సుధీర్ బాబు కి మధ్యన నాగ చైతన్య వెళ్తాడా..? లేదా..? అనేది ప్రస్తుతం ఇండస్ట్రీలో అందరి మదిలో మెదులుతున్న ఇంట్రెస్టింగ్ పాయింట్. శైలజారెడ్డి అల్లుడు ఆగస్టు 31 డేట్ వదులుకున్నాక టైం చాలా తక్కువ ఉండటంతో పాటు సెప్టెంబర్ 7న ఏకంగా ఐదు సినిమాల విడుదల ఉండటంతో సేఫ్ కాదనే ఉద్దేశంతో సెప్టెంబర్ 13న వద్దామనుకుంటే ఈ రెండు గట్టి సినిమాలు వలన ఇపుడు అల్లుడు తెగ టెన్షన్ ఫీల్ అవుతున్నాడు. మరి ఏ మాయ చేసావే సినిమాలో సమంత – చైతు జంటగా నటిస్తే.. సుధీర్ బాబు సామ్ అన్నగా విలన్ గా నటించాడు. ప్రస్తుతం భార్య భర్తల ఫైట్ తో పాటుగా.. ఏ మాయ చేసావే లో విలన్ గా నటించిన సుధీర్ బాబు కూడా భార్య భర్తలకు చెమటలు పట్టించేలా ఉన్నాడు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*