నిన్ను రోడ్డు మీద చూసినది లగాయితు….!

మన్మధుడు 2 Akkineni Nagarjuna manmadhudu 2

నాగార్జున కెరీర్ లో ఒన్నాఫ్ ది బిగ్గెస్ట్ హిట్ అయిన “అల్లరి అల్లుడు” చిత్రంలోని “నిన్ను రోడ్డు మీద చూసినది లగ్గాయితు” అనే సాంగ్ ఎంత పాపులర్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ మాస్ సాంగ్ ను యువసామ్రాట్ నాగచైతన్య తన తాజా చిత్రం “సవ్యసాచి”లో రీమిక్స్ చేస్తున్నాడు. “శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం” చిత్రాలతో హ్యాట్రిక్ హిట్ అందుకొన్న మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. “నిన్ను రోడ్డు మీద చూసినది లగ్గాయితు” రీమిక్స్ లో చైతూతో ఓ అగ్ర కథానాయకి ఈ పాటలో చిందేయనుంది. ఆమె ఎవరన్నది త్వరలోనే వెల్లడించనున్నారు దర్శకనిర్మాతలు. ఒరిజినల్ వెర్షన్ ను కంపోజ్ చేసిన కీరవాణి ఈ రీమిక్స్ వెర్షన్ కి కూడా సంగీత దర్శకులు అవ్వడం విశేషం. మాధవన్, భూమికలు కీలకపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో చైతూ సరసన బాలీవుడ్ బ్యూటీ నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. నాగచైతన్య అక్కినేని, నిధి అగర్వాల్, మాధవన్, రావురమేష్, వెన్నెల కిషోర్, సత్య, తాగుబోతు రమేష్ లు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: చందూ మొండేటి.

Ravi Batchali
About Ravi Batchali 17140 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*