నాగ శౌర్య జోరు మాములుగా లేదే..!

ఛలో సినిమాతో ఫాంలోకి దూసుకొచ్చిన నాగ శౌర్య కి కణం, అమ్మమ్మగారిల్లు సినిమాలు హిట్ కాకపోయినా.. మంచి పేరు తీసుకొచ్చాయి. ఇక తాజాగా నర్తనశాల సినిమాతో భారీ అంచనాల నడుమ ఈ నెల నాగ శౌర్య ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. పక్కా ప్రమోషన్స్ తో.. ఓన్ బ్యానర్ లో తెరకెక్కిన నర్తనశాల సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. 15 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన నర్తనశాల సినిమా హిట్ నాగ శౌర్య కి ఎంతో అవసరం. ఇక నర్తనశాల సినిమా తర్వాత నాగ శౌర్య చెయ్యబోయే మరో సినిమా కూడా ఫిక్స్ అయ్యింది.

టైటిల్ అదేనా..?

అది కూడా భవ్య క్రియేషన్స్ బ్యానర్ లో నారీ నారీ న‌డుమ మురారీ సినిమాని నాగ శౌర్య ఫైనల్ చేసాడు. మరి ఆ సినిమా లైన్ లో ఉండగానే.. నాగ శౌర్య మరో సినిమాని లైన్ లో పెట్టేసాడు. తన కుటుంబం సపోర్ట్ తో నాగ శౌర్య ఇప్పుడు హీరోగా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు. సొంత బ్యానర్ లోనే ఇప్పుడు మరో సినిమాని శేఖర్ కమ్ముల శిష్యుడికి కమిట్ అయ్యాడు నాగ శౌర్య. శేఖ‌ర్ క‌మ్ముల శిష్యుడు తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగ శౌర్య పేరు గణపతి గా చెబుతున్నారు. ఇక నాగశౌర్య పేరుతో అంటే సినిమా టైటిల్ కూడా గణగా ఉండబోతుంది. గణపతి పేరుతొ ఉన్న నాగశౌర్య ని ముద్దుగా గణ అని పిలవడంతో.. టైటిల్ ని కూడా గణ అనే పెట్టినట్లుగా తెలుస్తుంది.

శేఖర్ కమ్ముల శిష్యుడి దర్శకత్వంలో…

గ‌ణ‌ సినిమా కొత్త త‌ర‌హా కథేనని… కామెడీ, లవ్, యాక్ష‌న్‌.. కలగలిపి కామెడీ, యాక్షన్, రొమాంటిక్ ఎంటెర్టైనెర్ గా ఉండబోతుందని తెలుస్తుంది. ఇక శేఖర్ కమ్ముల శిష్యుడు తేజ న్యూయార్క్ లో ద‌ర్శ‌క‌త్వ డిపార్ట్మెంట్ లో శిక్ష‌ణ పొందాడు. ఇక ఇప్పటికే దాదాపుగా నాలుగు హాలీవుడ్ చిత్రాలకు తేజ సహాయ దర్శకుడిగా పనిచేశాడు కూడా. అమెరికాలో తెరకెక్కిన ఫిదా షూటింగ్ సమయంలో శేఖర్ కమ్ముల దగ్గర పనిచేశాడు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*