ముందు కెరీర్ పై దృష్టి పెట్టు…

ఒక మనస్సు సినిమాతో మెగా ఫ్యామిలీ నుంచి మొదటి హీరోయిన్ గా నాగబాబు కుమార్తె కొణిదెల నిహారిక టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకున్నా సినిమాలో హీరోహీరోయిన్లుగా నటించిన నాగశౌర్య, నిహారిక జంటకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. చూడముచ్చటగా ఉన్న ఈ జంట ప్రేమలో ఉంది అనే పుకార్లు అప్పట్లోనే షికార్లు చేశాయి. అంతేకాదు, వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారని వినిపించింది. అయితే, వీరు మాత్రం ముందు కెరీర్ పైనే దృష్టి పెట్టాలని భావిస్తున్నారు.

‘హ్యాపీ వెడ్డింగ్’తో రానున్న నిహారిక

ముందు మంచి సినిమాలు చేయడంపై దృష్టి పెట్టాలని నిహారికను ఆమె తల్లిదండ్రులు సూచించారట. దీంతో పుకార్లకు చెక్ పెడుతూ వీరిద్దరూ కెరీర్ పైనే తమ పూర్తి దృష్టి పెట్టారు. గత సంవత్సరం వీరిద్దరూ ‘ఓరు నల్లా పాతు సొల్రెన్’ సినిమా ద్వారా తమిళ్ లోనూ ఆరంగేత్రం చేయగా ఆ సినిమా కూడా ఫెయిల్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నిహారిక ‘హ్యాపీ వెడ్డింగ్’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉండగా, నాగశౌర్య రెండు సినిమాల చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*