సామ్ కన్నా…. చైతు సినిమాకే క్రేజుంది !!

నాగ చైతన్య – సమంత ఐదేళ్లుగా ప్రేమించుకుని గత ఏడాది పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నాక కూడా సమంత తన కెరీర్ లో దూసుకుపోతుంది. వరస హిట్స్ తో బీభత్సమైన ఫామ్ లోకొచ్చేసింది. ఇక నాగ చైతన్య మాత్రం పెళ్లి అయ్యాక అతనిది ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. కానీ సమంత నటించిన మూడు సినిమాలు పెళ్లయ్యాక విడుదల కావడం.. అవి కాస్తా సూపర్ డూపర్ హిట్స్ అవడంతో…సమంత రేంజ్…. క్రేజు ఒక్కసారిగా మారిపోయాయి. రంగస్థలం వంటి ఇండస్ట్రీ హిట్ తోనూ, మహానటి వంటి బయోపిక్ లోను, అభిమన్యుడు వంటి సినిమాతోనూ సమంత ఫుల్ ఫామ్ లో ఉంది. ఇక నాగ చైతన్య నటించిన సినిమాలేవీ పెళ్లి తర్వాత విడుదల కాలేదు.

శైలజారెడ్డి అల్లుడితో……

ప్రస్తుతం నాగ చైతన్య మారుతీ దర్శకత్వంలో నటించిన శైలజా రెడ్డి అల్లుడు రేపు గురువారం విడుదల కాబోతుంది. అలాగే సమంత ఇష్టపడి చేసిన యు-టర్న్ కూడా రేపు గువారం చైతు శైలజ రెడ్డి అల్లుడుతో తలపడబోతుంది. మరి భార్యాభర్తల మధ్య బాక్సాఫీసు వార్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ హాట్ చర్చలకు తెర తీసింది. అయితే సమంత క్రేజుతో ఉన్నప్పటికీ.. ప్రస్తుతం సమంత చేసిన యు – టర్న్ సినిమా మీద కన్నా ప్రేక్షకులకు ఒకింత ఆసక్తి నాగ చైతన్య శైలజ రెడ్డి అల్లుడు మీదే ఉంది. మహానుభావుడు సినిమా హిట్ తో ఉన్న మారుతీ దర్శకత్వంలో ఈ శైలజ రెడ్డి అల్లుడు తెరకెక్కడం, శివగామి లాంటి పవర్ ఫుల్ అత్తగా రమ్యకృష్ణ ఈ సినిమాలో నటించడంతో .. శైలజ రెడ్డి అల్లుడు మీద ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెరిగింది.

రీమేక్ మూవీ కావడంతో…..

ఇక సమంత కూడా ఈ ఏడాది మూడు వరస హిట్స్ ఉంది. అయితే సమంత చేసిన రీమేక్ మూవీ యు-టర్న్ సస్పెన్స్ త్రిల్లర్ సినిమా కావడం.. ఈ సినిమలో సమంత తప్ప మారె క్రేజీ పాయింట్ లేకపోవడం… అలాగే కామెడీ ఎంటెర్టైనెర్ గా ఉన్న శైలజ రెడ్డి అల్లుడు మీదున్న క్రేజ్ ముందు సూసెన్సు త్రిల్లర్ నిలవగలదో లేదో అనే అనుమానం అయితే ట్రేడ్ లో ఉంది. అయితే సమంత క్రేజ్ మీద నమ్మకంతో యు-టర్న్ సినిమాకి మంచిఓపెనింగ్ రావడమే కాదు.. శైలజ రెడ్డి అల్లుడుతో పోటీ పడి సినిమా బిగ్గెస్ట్ హిట్ అవుతుందంటున్నారు. ఏది ఏమైనా చైతు సినిమాకన్నా యు- టర్న్ సినిమాకి కాస్త బజ్ తక్కువే ఉంది.