నాగ్ కెరీర్ మీద దెబ్బ కొట్టిన ఆ డైరెక్టర్..!

Akkineni Nagarjuna has no movies in hand

టాలీవుడ్ లో ప్రస్తుతం సీనియర్స్ అంతా తమ తమ సినిమాలతో బిజీగా ఉంటే నాగార్జున మాత్రం ఖాళీగా ఉన్నాడు. చిరంజీవి ‘సైరా’తో పాటు కొరటాల శివ, త్రివిక్రమ్ సినిమా ఒప్పుకుని కూర్చున్నాడు. బాలకృష్ణ.. ఎన్టీఆర్ బయోపిక్ తో పాటు బోయపాటితో సినిమాకి రెడీ అవుతున్నాడు. అలానే వెంకీ ఎఫ్2 తరువాత ఇంకో సినిమాని లైన్ లో పెట్టుకున్నాడు. కానీ నాగార్జున మాత్రం ఇప్పటివరకు స్ట్రెయిట్ గా ఒక్క సినిమాని కూడా ఒప్పుకోలేదు. హిందీ, మలయాళంలో రెండు చిత్రాల్లో అతిథి పాత్రలు మినహా నాగార్జున ఒప్పుకున్న చిత్రాలేమీ కావు. తమిళ్ లో ధనుష్ డైరెక్షన్ లో ఓ సినిమా చేయడానికి ఓకే చెప్పాడు కానీ అది సెట్స్ మీదకు వెళ్లే సూచనలు కనిపించడం లేదు.

ఆఫీసర్ ఎంత పని చేసింది

నాగ్ ఇలా ఖాళీగా ఉండడానికి ప్రధాన కారణం గత ఏడాది వచ్చిన ‘ఆఫీసర్‌’ చిత్రం. నాగ్ కెరీర్ లో ఎన్నడూ లేని విధంగా ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఘోర పరాజయం నాగార్జున కాన్ఫిడెన్స్‌ ని దెబ్బ తీసినట్టుంది. ఈ సినిమాతో కోటి రూపాయలు షేర్ కూడా తెచ్చుకోలేకపోయాడు నాగ్. దీంతో ఆయన ఆత్మవిశ్వాసంపై అయితే అది బాగానే దెబ్బ కొట్టింది. రీసెంట్ గా చేసిన ‘దేవదాస్’ చిత్రం అయినా సక్సెస్ అయ్యి ఉంటే నాగ్ తన నెక్స్ట్ మూవీస్ విషయంపై క్లారిటీ ఇచ్చేవాడు. అదీ జరగకపోవడంతో అలా సైలెంట్ అయ్యిపోయాడు. మరోపక్క కుమారుల సినిమాలు కూడా ఫెయిలవుతూ ఉండడం కూడా నాగార్జునకి ఇబ్బందిగా మారింది. అలా రామ్ గోపాల్ వర్మ నాగ్ ని బాగా దెబ్బ తీసాడు. మరి నాగ్ ఫ్యామిలీకి మునిపటి కల ఎప్పుడు వస్తుందో.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*