అఖిల్ గురించి నిజాలు చెప్పేసిన నాగ్..!

నాగార్జున ప్రస్తుతం దేవదాస్ సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు. నానితో కలిసి శ్రీ రామ్ ఆదిత్య దర్శకత్వంలో దేవదాస్ అనే మల్టీస్టారర్ లో నటించిన నాగార్జున… శుక్రవారం విడుదలకాబోతున్న సినిమా ముచ్చట్లు మీడియాతో పంచుకోవడమే కాదు.. తన వయసు గురించి, తన కొడుకులు నాగ చైతన్య, అఖిల్ విషయాలను కూడా మీడియాతో పంచుకున్నాడు. తనకు ఇంకా 25 ఏళ్ల వయసు అనే మనసులో అనుకుంటానని.. తన పెద్ద కొడుకు చైతు కన్నా చిన్నోడినే కదా అంటూ ఫన్నీగా నవ్వేసాడు. ఇక తన వయసు 25 అని ఫీల్ అయినా… తన కొడుకుల సినిమాల విషయంలో సలహాలు ఇచ్చేటప్పుడు మాత్రం పెద్దగా ఫీల్ అవుతానని చెబుతున్నాడు.

ఇక్కడ హిట్ అయ్యాకే…

ఇక అఖిల్ అయితే అఖిల్ సినిమా చేసే టైంలో చెప్పిన మాట వినలేదని.. తొందరపడి నిర్ణయం తీసుకున్నాడని.. అందుకే ఫలితం అనిభావించాల్సి వచ్చిందని చెబుతున్నాడు. ఆలాగే అఖిల్ హిందీ డెబ్యూపై కూడా నాగార్జున స్పందించాడు. బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ కి అఖిల్ అంటే చాలా ఇష్టమని.. అందుకే అఖిల్ హిందీ డెబ్యూ మూవీ తానే చేస్తానని ఒకటికి రెండుసార్లు అడిగినా తొందరపడొద్దు… ఇప్పటికే ఒకసారి అఖిల్ తొందరపడ్డాడని.. తెలుగులో అఖిల్ నటించిన చిత్రమేదైనా సూపర్ హిట్ అయితే దాన్ని హిందీలో రీమేక్ చేద్దువుగానీ అని చెప్పినట్లుగా చెబుతున్నాడు. అలాగే తాను ఇక్కడ శివతో హిట్ కొట్టాక ఆ సినిమాని బాలీవుడ్ లో రీమేక్ చేసినట్లుగా చెప్పుకొచ్చాడు. అఖిల్‌ ఓసారి తొందరపడ్డాడు. కొన్నిసార్లు పెద్దోళ్లు చెప్పే మాటలు వినాలి. అంటూ అఖిల్ గురించిన విషయాలన్నీ నాగార్జున మీడియాకి చెప్పేసాడు. ప్రస్తుతం అఖిల్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో మిస్టర్ మజ్ను లో నటిస్తున్నాడు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1