నాగ్ డ్రీమ్ ప్రాజెక్ట్ పై కసరత్తులు!

heroin in bangarraju movie

నాగార్జున ప్రస్తుతం ఆఫీసర్ సినిమా విడుదల విషయంలో చికాకులు ఎదుర్కొంటున్నాడు. ఆఫీసర్ సినిమా ఈ నెల 25 న విడుదలవ్వాల్సి ఉండగా కొన్ని సమస్యల వలన ఆ సినిమా జూన్ 1 కి మారింది. ఈ విషయాన్ని డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అధికారికంగా ప్రకటించాడు. ఆఫీసర్ సినిమాతో ఇరుక్కుపోయిన నాగ్ ప్రస్తుతం తన డ్రీమ్ ప్రాజెక్ట్ విషయంలో ముందుకెళ్లాలని భావిస్తున్నాడట. నాగార్జున కు కళ్యాణ్ కృష్ణ సొగ్గాడే చిన్నినాయన సినిమాతో మంచి హిట్ ఇచ్చాడు. అయితే ఆ సినిమాలో బంగార్రాజు అనే పాత్ర ప్రేక్షకుల్లోకి బాగా ఎక్కింది. అందుకే నాగ్ అదే పేరుతొ ఒక సినిమాని కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చెయ్యాలనుకున్నాడు.

త్వరలోనే సెట్స్ పైకి….

కానీ కొన్ని కారణాల వలన ఆ సినిమా అనుకున్న టైంకి పట్టాలెక్కలేదు. అందుకే కళ్యాణ్ కృష్ణ కూడా రారండోయ్ వేడుక చూద్దాం తర్వాత బంగార్రాజుని తెరకెక్కించే ప్లాన్ చేసినప్పటికీ నాగ్ సహకరించకపోవడంతో రవితేజ తో నేల టికెట్ సినిమాని చేసాడు. ఇక ఈ నేలటికెట్ సినిమా ఈ నెల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి  నేలటికెట్,  ఆఫీసర్ సినిమాలు విడుదలవ్వగానే కళ్యాణ్ కృష్ణ – నాగార్జున కాంబోలో బంగార్రాజు సినిమా తెరకెక్కే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎలాగూ నాగ్ ఇంతవరకు ఏ దర్శకుడికి కమిట్ కాలేదు.అలాగే కళ్యాణ్ కృష్ణ కూడా బంగార్రాజు స్క్రిప్ట్ వర్క్ ని ఎప్పుడో పూర్తి చేసుకున్నాడు. ఏదో చిన్న చిన్న మార్పులు చేస్తే నాగ్ తో బంగార్రాజు సినిమాని పట్టాలెక్కించేయొచ్చు. మరి వీరి కాంబోలో ఈ బంగార్రాజు ప్రాజెక్ట్ జూన్ 25వ తేదీన సెట్స్ పైకి వెళ్లనుందనే టాక్ వినిపిస్తోంది.

Sandeep
About Sandeep 6914 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*