బ్యాంకు మేనేజర్ కి క్లాస్ పీకిన నాగార్జున

అక్కినేని నాగార్జున కళ్యాణ్ జ్యూవెలర్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. అందుకు సంబంధించి కొన్ని యాడ్స్ లో కూడా నటించారు నాగార్జున. అయితే ఈ నేపథ్యంలో లేటెస్ట్ గా నాగార్జున నటించిన ఓ యాడ్ ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఈ యాడ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో నాగ్ ముసలాయనగా నటించారు. బ్యాంకు మేనేజర్ కు తప్పులు, నిజాయితీ గురించి క్లాస్ పీకడం ఆ వీడియోలో కనిపిస్తుంది. ఓ ముసలాయన తన మనవరాలిని వెంట పెట్టుకుని బ్యాంకుకు వెళ్తాడు. అక్కడ తన పెన్షన్ గురించి కౌంటర్ లో ఉన్నవాళ్లతో మాట్లాడటానికి ట్రై చేస్తాడు, కానీ అతడిని ఎవరూ పట్టించుకోరు. సరే అని మేనేజర్ దగ్గరకి వెళ్లి తన ఖాతాలో రెండుసార్లు పెన్షన్ జమ అయిందని మేనేజర్ కు చెబుతాడు.

ఆ మరక తొలగించుకునేందుకేనా..?

ఆ పాస్ బుక్ చూసి…రెండు సార్లు డబ్బులు పడటం అంటే అదృష్టం ఉండాలి.. నీకు ఉంది.. ఆ రెండోసారి పడిన డబ్బు కూడా నువ్వే ఉంచేసుకో ఎవరికి తెలియదు కాబట్టి అని ఉచిత సలహా ఇస్తాడు మేనేజర్. కానీ ఆ ముసలాయన లేదు మీ డబ్బు మీరు తీసుకోండి ఎవరికైనా తెలిసినా, తెలియకపోయినా…తప్పు తప్పేనని…తానెపుడూ తప్పుచేయనని… మేనేజర్ కు నాగ్ క్లాస్ పీకుతాడు. కొద్దీ రోజులు కిందట దుబాయ్ లోని కల్యాణ్ జ్యూవెలర్స్ స్టోర్ లో దొంగ బంగారం అమ్ముతున్నారని… పోలీసులు రైడ్ చేసి పట్టుకున్నారని సోషల్ మీడియాలో ఓ ఫేక్ వీడియో వైరల్ అయింది. దాన్ని ఉదేశించే ఈ యాడ్ చేసారని.. కస్టమర్లలో ఆ బ్రాండ్ కు ఉన్న భ్రమలను తొలగించేందుకే చేసారని చెబుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1