మళ్ళీ రీ షూటా?

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో రామ్ గోపాల్ వర్మ పరిస్థితి ఏం బాగోలేదు. అసలు ఇకనుండి వర్మకి డైరెక్షన్ అవకాశాలు ఏ హీరోలైనా ఇస్తారంటే అనుమానమే. అంతలా వర్మ తన ఇమేజ్ ని శ్రీ రెడ్డి వ్యవహారంలో తల దూర్చి డ్యామేజ్ చేసుకున్నాడు. శ్రీ రెడ్డి తో పవన్ కళ్యాణ్ ని తిట్టించి పవన్ ఫాన్స్ తో పాటు ఇండస్ట్రీ పెద్దలు, మెగా హీరోల ఆగ్రహానికి గురయ్యాడు. గత కొంతకాలం నుండి రామ్ గోపాల్ వర్మ తిన్నగా ఒక్క పని చేసింది లేదు. అసలు ఫామ్ లో లేని వర్మకి నాగార్జున ఆఫీసర్ చిత్ర అవకాశం ఇవ్వడమే ఎక్కువ. నాగార్జున ఎక్కువగా వివాదాలకు దూరంగా ఉండడానికే ఇష్టపడతాడు. అయినా వర్మ నాగార్జున సినిమాని తెరకెక్కిస్తూ.. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విషయంలోనూ, జీఎస్టీ విషయంలోనూ నానా హడావిడి చేసాడు. అయినా నాగ్ మౌనంగానే ఉన్నాడు.

అయితే నాగార్జున – వర్మల సినిమా షూటింగ్ కంప్లీట్ కావడము సినిమా మే 25 న విడుదల తేదీ ప్రకటించడం జరిగిపోయాయి. కాకపోతే వర్మ ఎఫెక్ట్ తో ఆఫీసర్ సినిమాకి బిజినెస్ జరగలేదనే టాక్ ఉంది. ఇక ఇప్పుడు పవన్ విషయంతో సినిమా మీద ప్రేక్షకులకు పూర్తిగా ఆసక్తి పోయింది అంటున్నారు.అయితే ఇవన్నీ లెక్కచెయ్యని వర్మ, నాగార్జున ఆఫీసర్ సినిమా కి రీ షూటింగ్ నిర్వహిస్తున్నాడనే టాక్ సోషల్ మీడియాలో వినబడుతుంది. అందుకే నాగార్జున ముంబై లోని ఆఫీసర్స్ సెట్స్ కి మళ్ళీ వెళ్లినట్టుగా చెబుతున్నారు. షూట్ జరిగిన స్టూడియోకి మళ్ళీ నాగార్జున వెళ్లడంతో.. ఆఫీసర్ లో కొన్ని సీన్స్ నాగ్ కి నచ్చక వర్మతో రీ షూట్ చేపిస్తున్నాడంటున్నారు

మరి నాగార్జున ఆఫీసర్ సినిమాలో పోలీస్ అధికారిగా కనబడుతున్నాడు.అయితే ఈ సినిమా ఇంటర్వెల్ కూడా లేకుండా కేవలం గంటా 45 నిమిషాలు మాత్రమే ఉంటుందట. అలాగే ఈ సినిమా మొత్తం ఇద్దరు కూతుళ్లని ఓ గ్యాంగ్ కిడ్నాప్ చేయడం… వాళ్లని సీఐఏ అధికారి విడిపించడమే అసలు స్టోరీ అంటున్నారు

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*