నాగ్ కి వర్మ తలనొప్పి

అసలు రామ్ గోపాల్ వర్మ తో సినిమా అంటేనే అందరూ భయపడిపోతుంటే నాగార్జున మాత్రం వర్మకి సినిమా అవకాశం ఇచ్చాడు. అందరూ నాగ్ ని తప్పు పట్టినా కేర్ చేయకుండా వర్మ డైరెక్షన్ లో ఆఫీసర్ సినిమా చేసాడు. ఇప్పటికే ఆఫీసర్ సినిమా బిజినెస్ వర్మ వలన అంతంత మాత్రంగా ఉంది. సినిమా ఈ నెల 25న విడుదల కావల్సిఉంది. ఇక వర్మ పై ఇండస్ట్రీ మొత్తం కక్ష కట్టింది. కానీ నాగ్ మాత్రం వర్మ విషయంలో ఏం చేయలేక కూర్చున్నాడు. దీంతో ఇప్పుడు నాగ్ కి వర్మ తల నొప్పి మాములుగా లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆఫీసర్ సినిమా విడుదల కాకుండా బాంబే హైకోర్టు బ్రేక్ వేసింది. దీంతో వర్మ పరిస్థితి ఏమిటో గాని నాగార్జున పరిస్థితి మాత్రం కుడితిలో పడ్డ ఎలుకలా మారింది.

వర్మ సినిమాకు బ్రేకులెందుకంటే….

ఇంతకీ కోర్టు ఆఫీసర్ సినిమాకు ఎందుకు బ్రేకులు వేసింది అంటే.. వై టీ ఎంటర్ టైన్మెంట్స్ వాళ్లకి వర్మ ఇవ్వాల్సిన 1.06 కోట్లు ఇవ్వకపోవడంతో వై టీ ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ బాంబే హైకోర్టు లో పిటీషన్ వేసింది. తమకు రామ్ గోపాల్ వర్మ ఇంకా కొంత సొమ్ము బకాయిలు చెల్లించాల్సి ఉందని వారు పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ ను పరిశీలించిన జస్టిస్ ఎస్.జె.కట్టావల్లా ఆఫీసర్ చిత్రానికి సంబంధించిన హక్కులను ఎవరికైనా అమ్మడమో లేదా బదిలీ చేయడమో చేయరాదని, నెగెటివ్ లు, లేదా డిజిటల్ ప్రింట్లను విడుదల చేయవద్దని  ఆదేశించారు.

వాయిదాలకు హాజరుకాకుండా….

కానీ వర్మ కోర్టు ఇచ్చిన వాయిదాలకు హాజరుకాలేదు. ఒక వాయిదాకి వర్మ లాయరు హాజరు కాగా, మరో వాయిదాకి ఆఫీసర్  సినిమా సహ నిర్మాత హాజరయ్యారు. కానీ, వర్మనే బకాయిల విషయమై అంగీకారపత్రం పై సంతకం చేయాలని, కోర్టుకు స్వయంగా హాజరుకావాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఆఫీసర్ చిత్రాన్ని స్వయంగా రామ్ గోపాల్ వర్మ తన కంపెనీ బ్యానర్ లో నిర్మించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు నాగ్ కి వర్మ విషయంలో ఉన్న తలనొప్పుల కన్నా ఇప్పుడు ఈ తలనొప్పి ఎక్కువైంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*