ఫ్రెండ్ కాబట్టి చేశా.. లేదంటే

నాగ శౌర్య

శ్రీనివాస్ చక్రవర్తి దర్శకుడిగా నాగ శౌర్య హీరోగా ఐరా క్రియేషన్స్ లో తెరకెక్కిన నర్తనశాల సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సొంత బ్యానర్ లో వరసగా సినిమాలు చేస్తున్న నాగ శౌర్యకి మల్టీస్టారర్ చిత్రాలంటే అసలిష్టమే లేదంట. నర్తనశాల సినిమా ప్రమోషన్స్ లో ఉన్న నాగశౌర్య ఒక మీడియా మిత్రుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా… తనకి నారా రోహిత్ కి ఉన్న ఫ్రెండ్ షిప్ వలన.. రోహిత్ తో ఉన్న అండర్ స్టాండింగ్ వలన రెండు సినిమాలు రోహిత్ తో కలిసి చేశానని… ఇక మీదట మల్టీస్టారర్ చిత్రాలు చెయ్యనని చెబుతున్నాడు ఈ యంగ్ హీరో.

మరి నారా రోహిత్ తో కలిసి నటించిన జ్యో అచ్యుతానంద మంచి హిట్ కాగా… కథలో రాజకుమారి అట్టర్ ప్లాప్ అయ్యింది. అయితే కుర్ర హీరోలు కూడా ఒక హీరో సినిమాలో మరో హీరో నటించడానికి తెగ ఉత్సాహం చూపిస్తుంటే… నాగశౌర్య ఇప్పుడు ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం మాత్రం కాస్త ఆశ్చర్యం కలిగించే విషయమే. తాజాగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలే మల్టీస్టారర్ కి సై అంటుంటే నాగ శౌర్య మాత్రం ఇలా మల్టీస్టారర్ సినిమాలు చెయ్యననడం ఏమిటో ఆయనకే తెలియాలి.

ఇక ఛలో సినిమా హిట్ తో నర్తనశాల మీద మంచి అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం ప్రేక్షకులముందుకు వచ్చిన నర్తనశాల దమ్ము ఎంతుందో కాసేపట్లో ప్రేక్షకులు తీర్పు చెప్పేస్తారు. ఇక నాగ శౌర్య నర్తనశాల తర్వాత రమణ అనే న్యూ డైరెక్టర్ కి కమిట్ అయ్యాడట. ఇక ఆ సినిమా కాకుండా నాగ శౌర్య మరో రెండు సినిమాలు చేస్తున్నట్టుగా చెప్పుక్కుకొచ్చాడు

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*