నాగ శౌర్య ఆలోచిస్తే బావుండేదేమో

నందమూరి హరికృష్ణ నిన్న బుధవారం తెల్లవారు జామున రోడ్డు ప్రమాదానికి గురై కన్ను మూసిన విషయం తెలిసిందే. 61 ఏళ్లకే నిండు నూరేళ్లు నిండిన హరికృష్ణ మరణానికి ఇండస్ట్రీలోని ప్రముఖులు, రాజకీయనాయకులు, నందమూరి అభిమానులు ఘన నివాళి అర్పిస్తున్నారు. అభిమానులు, కుటుంబ సభ్యుల కన్నీళ్ల మధ్య ఈ రోజు గురువారం సాయంత్రం ఫిలిం నగర్ మహా ప్రస్థానంలో హరికృష్ణ అంత్యక్రియలు జరగనున్నాయి. హరికృష్ణ మరణం కుటుంబానికి, రాష్ట్రానికి తీరని లోటని ఏపీ సీఎం, హరికృష్ణ బావగారు చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో రెండు రోజులపాటు సంతాప దినాలుగా ప్రకటించారు. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ హరికృష్ణ మృతి తీరని లోటని హరికృష్ణ కుటుంబ సభ్యులను ఓదార్చిన తర్వాత ప్రభుత్వ లాంఛనాలతో హరికృష్ణ అంత్యక్రియలు జరిపించాలని సీఎస్ ని ఆదేశించారు.

అయితే సీనియర్ ఎన్టీఆర్ గతంలో నటించిన నర్తనశాల టైటిల్ తో యంగ్ హీరో నాగ శౌర్య నటించిన @నర్తనశాల సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు హంగామా హడావుడితో వచ్చింది. యంగ్ హీరో నాగ శౌర్య నటించిన @నర్తనశాల ను ఈ రోజు ఎటువంటి హడావిడి లేకుండా విడుదల చేస్తారేమో అని అందరూ అనుకున్నారు. కానీ నర్తనశాల థియేటర్స్ దగ్గర భారీ హడావిడి చేస్తూ…నాగ శౌర్య ఫాన్స్ హంగామా చెయ్యడం… రాష్ట్రంలో హరికృష్ణ కి రెండు రోజులు సంతాప దినాలు ప్రకటించిన టైం లో తమ సినిమాకి అంత హడావిడి చెయ్యడం అవసరమా అని నందమూరి అభిమానులు కొంతమంది నాగ శౌర్య మీద ఫైర్ అవుతున్నారు. నందమూరి టైటిల్ వాడుకున్న నాగశౌర్య నందమూరి ఫ్యామిలీకి ఇచ్చే రెస్పెక్ట్ ఇదేనా అంటున్నారు వారు. ఇండస్ట్రీ మొత్తం హరికృష్ణ కి నివాళులు అర్పిస్తున్న టైం లో కాస్త కామ్ గా థియేటర్స్ లోకి వస్తే ఓకె. కానీ ఇలా హడావిడి అంగు హార్భాటాలతో రావడం అవసరమా అంటున్నారు. అసలు హరికృష్ణకు నివాళులు అర్పించేది ఇలాగేనా అంటూ అంటూ పెదవి విరుస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*