మోక్షజ్ఞ గురించి క్లారిటీ లేదే…!!.

ntr biopic trailer review nandamuri balakrishan trailer review telugu post telugu news

క్రిష్ – బాలకృష్ణ కాంబోలో ఎన్ బికే ఫిలిమ్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు, మహానాయకుడు మూవీ మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా ఆడియో వేడుక తాజాగా హైదరాబాద్ లో జరిగింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రధారి బాలయ్య తండ్రిని మించిన ఆకర్షణతో కనబడుతున్నాడు. ఇక ఎన్టీఆర్ బయోపిక్ ట్రైలర్ సినిమా మీద ఉన్న అంచనాలు మరింతగా పెంచేసింది. ఈ సినిమాలో భాగమైనందుకు చాలామంది తారలు క్రిష్ కి బాలయ్యకి ఆడియో వేడుక స్టేజ్ మీద కృతఙ్ఞతలు చెప్పుకున్నారు. నందమూరి ఫ్యామిలీ అయితే ఈ సినిమాలో చిన్న వేషం దక్కినా మహద్భాగ్యంగా చెప్పుకుంటున్నారు.

మోక్షజ్ఞ చేయడం లేదా?

అయితే ఈసినిమాలో నందమూరి మోక్షజ్ఞ ఎలాంటి పాత్ర చెయ్యలేదని స్పష్టమైంది. అయితే ఎన్టీఆర్ బయోపిక్ లో మొదట్లో బాలయ్య ఎన్టీఆర్ పాత్ర చేస్తుంటే…. బాలయ్య పాత్రని మోక్షజ్ఞ చేస్తాడనే ప్రచారంజోరుగా జరిగింది. తాజాగా బాలకృష్ణ తన చిన్ననాటి పాత్రని తన రెండో కూతురు కొడుకు అంటే తన మనవడు పోషించినట్లుగా చెప్పి ట్విస్ట్ ఇచ్చాడు. అయితే బాలయ్య చిన్నప్పటి పాత్ర అయన మనవడు చేస్తే… పెద్దయ్యాక ఆ పాత్రని ఎవరు చేసారో క్లారిటీ లేదు. ఎందుకంటే నిన్న విడుదల చేసిన ఎన్టీఆర్ బయోపిక్ ట్రైలర్ లో ఎవరిని పెద్దగా చూపించకుండా… ట్రైలర్ మొత్తం ఎన్టీఆర్, బసవతారకం పాత్రల నే హైలెట్ చేసాడు క్రిష్. మరి విద్య బాలన్ ఈ సినిమాకి ఎంత కీలకమో తెలియజేసారు. అసలు నిజ జీవితంలో బసవతారకం గురించి ఎవరి పెద్దగా తెలియదు. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ లో బసవతారకం పాత్రని క్రిష్ ఎంతగా హైలెట్ చేసాడు అంటే….కథానాయకుడు సినిమాలో ఆమె కీలకం అన్నట్టుగా.

జూనియర్ కు కూడా…..

ఇక ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ పాత్ర లేదు. కానీ ఆడియో వేడుకకి బాలయ్య జూనియర్ ని ఆహ్వానించి నందమూరి అభిమానుల మనసును మరింతగా గెలుస్తుంచుకునందు. ఇక బాలయ్య మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో అనేది ఎవరికీ అంతు పట్టని ప్రశ్నే. అప్పుడే హుషారుగా బావుంటాడు. అప్పుడే కోపగించుకుంటాడు. ఏది ఏమైనా ఎన్టీఆర్ పాత్ర చేసిన బాలయ్య మాత్రం అదుర్స్ అనే చెప్పాలి. మరి ఇంత చేస్తున్న బాలయ్య మోక్షజ్ఞ గురించి ఎప్పుడు ఆలోచిస్తాడో అనే అనుమానంలో నందమూరి ఫాన్స్ ఉన్నారు. అసలు ఇంత భారీ అంచనాలతో తెరకెక్కుతున్నామోక్షజ్ఞ ని ఈ సినిమాలో ఏదో ఒక పాత్ర ద్వారా ఇండస్ట్రీకి పరిచయం చేస్తే బావుండేదని అభిప్రాయాలను వ్యక్తంచేస్తున్నారు అభిమానులు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*