అబ్బా చూడముచ్చటగా వుంది

ntr may attend ntr audio function telugu post telugu news

ఇప్పటివరకు మెగా ఫ్యామిలిలో పవన్ కళ్యాణ్ మెగా ఫ్యామిలీతో కలిస్తే అదో పెద్ద సెన్సేషన్ చేసిన మీడియాకి అప్పుడప్పుడు నందమూరి ప్యామిలీ మీద కూడా మీడియా డేగ కన్ను వేసే ఉంటుంది. ఎందుకంటే నందమూరి ఫ్యామిలిలో కూడా లుకలుకలున్నాయి. అందుకే మీడియా కి అది కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ తో నందమూరి ఫ్యామిలి బాలకృష్ణ పెద్దగా కలవడు. అది కూడా బావగారు చంద్రబాబు గురించే అనేది ఓపెన్ టాక్. చంద్రబాబు బాలకృష్ణ కి చెప్పడం వల్లనే ఎన్టీఆర్ ని పక్కన పెట్టేసాడని… ఇక జూనియర్ ఎన్టీఆర్ తో సన్నిహిత సంబంధాలను వదిలేసి హరికృష్ణ ని కూడా బాలకృష్ణ దూరం పెట్టేసాడు. హరికృష్ణ ని దూరం పెట్టేసిన బాలయ్య బావగారు చెప్పినట్టు నడుచుకోవడం నందమూరి ఫ్యాన్స్ ని కాస్త షాక్ కి గురిచేసింది.

అయితే ఒకప్పుడు ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్ కూడా జూనియర్ ఎన్టీఆర్ తో అంటీముట్టనట్లు ఉన్నా.. హరికృష్ణ కి జబ్బు చేసినప్పటినుండి కళ్యాణ్ రామ్ నందమూరి ఫ్యామిలీతో పాటుగా ఎన్టీఆర్ ని అక్కున చేర్చుకున్నాడు. ఇక జానకి రామ్ మరణంతో కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ బాగా కలిసిపోయారు. హరికృష్ణ కి ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ రెండు కళ్ళులా మారారు. ఇక కళ్యాణ్ రామ్ తమ్ముడు ఎన్టీఆర్ ని చూసుకుంటూనే బాలయ్య ఫ్యామిలితోను సత్సంబందాలు కొనసాగించాడు. అయితే గత కొన్నాళ్లుగా హరికృష్ణ ఫ్యామిలీతో దూరంగా ఉన్న బాలకృష్ణ ఇప్పుడు అన్న హరికృష్ణ మరణంతో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ని అక్కున చేర్చుకున్నట్లే కనబడుతుంది.

అన్నగారు మరణముతో హరికృష్ణ ఇంటిదగ్గర ఉండి ఏర్పాట్లను చూస్తూ.. గవర్నర్, కేసీఆర్ లను రిసీవ్ చేసుకోవడం దగ్గరనుండి…. అన్నగారి పాడిమోస్తూ కళ్యణ్ రామ్, ఎన్టీఆర్ లకు దగ్గరగా ఉన్నాడు. ఇక తాజాగా నిన్న హరికృష్ణ ఇంటిదగ్గర జరిగిన భజనలో బాలకృష్ణ భోజనం చేస్తూ ఆ ప్లేట్ తో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు భోజనము చేసే దగ్గరికి వెళ్లి వారితో మాట కలపడమే కాదు.. ఎన్టీఆర్… బాబాయ్ బాలకృష్ణ చెప్పేది శ్రద్దగా వినడం.. అక్కడే కళ్యాణ్ రామ్ కూడా ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. నిజంగా ఆ వీడియో చూసిన నందమూరి ఫ్యాన్స్ మాత్రం మాకు కావాల్సింది ఇదే అంటూ.. మేమంతా ఒకటే అంటూ కామెంట్స్ తో సోషల్ మీడియాలో హడావిడి మొదలెట్టారు. ఇక ఎన్టీఆర్ తో బాలయ్య మాట్లాడే ఆ వీడియో సామజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ఇక హరికృష్ణ చనిపోయి తన కొడుకులను తన ఫ్యామిలీతో కలిపాడంటున్నారు నందమూరి ఫాన్స్.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*