బాలయ్య ఎనర్జీ సూపర్బ్!!

nandamuri balakrishna ntr kadhanayakudu

నిన్న శుక్రవారం రాత్రి హైదరాబాద్ లో జరిగిన ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు ఆడియో కి ఎన్టీఆర్ సన్నిహత నటులతో పాటుగా… ఎన్టీఆర్ బయోపిక్ లో భాగమైన నటులు…. నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ హాజరయ్యారు. ఈ వేడుకలో ప్రధాన ఆకర్షణ బాలకృష్ణ ఎన్టీఆర్ గెటప్ కాగా…. జూనియర్ ఎన్టీఆర్ మరో మెయిన్ అట్రాక్షన్. జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ బయోపిక్ లో భాగం కానప్పటికీ… ఈ వేడుకకి బాబాయ్ బాలయ్య పిలవగానే పెరిగెట్టుకుని వచ్చేసాడు. ఇక ఎన్టీఆర్ కుటుంబంలో తాను ఒక సభ్యుడినైనందుకు గర్వంగా ఉందని చెప్పి నందమూరి అభిమానుల మనసు గెలిచాడు. ఇక బాలకృష్ణ ఆ వేడుక జరుగుతున్నంత సేపు వచ్చిన అతిధులను ఆహ్వానిస్తూ.. స్టేజ్ మీద తండ్రి ఎన్టీఆర్ గురించి ఎన్టీఆర్ బయోపిక్ ముచ్చట్ల గురించి మాట్లాడుతున్న వారికి దగ్గరలోనే నిలబడి మరీ వారిని ప్రోత్సహించాడు. మామూలుగానే బాలయ్య ఎనర్జీ కుర్ర హీరోలకు కూడా ఉండదు.

గంటల తరబడి నిలబడి…..

ఇక నిన్న జరిగిన వేడుకలో బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో వేడుక మీద గంటల తరబడి నించోవడమే కాదు.. చాలా హుషారుగా కనిపించారు. అథిదులు మాట్లాడుతున్నప్పుడు… ఇంకా తన తండ్రి గురించి వారేమన్న మరిచిపోయిన ముచ్చట్లను గుర్తు చేస్తూ స్టేజ్ మీద అలా గంటలు తరబడి నిలబడడం మాటలు కాదు. కానీ చివరి వరకు ఆయన చిన్న అలసటకు కూడా లోనైనట్లుగా కనబడలేదు. తండ్రి బయోపిక్ లో తాను నటించడం తన అదృష్టమని చెప్పిన బాలయ్య అన్న కొడుకులు కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ లతో ఎంతో ఆత్మీయంగా కనిపించాడు. అలాగే తన అక్కలతోను, క్రిష్, మోహన్ బాబు, జమున అందరితో ఎంతో యాక్టీవ్ గా మట్లాడుతూ చాలా ఎనర్జీ తో బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో వేడుకని పూర్తి చేసాడు. మరి అన్ని గంటలు స్టేజ్ మీద స్పెండ్ చేసిన బాలయ్య తాను స్పీచ్ ఇచ్చేటపుడు కూడా అంతే హుషారుగా మాట్లాడాడు. అసలు బాలయ్య ఎనర్జీ లెవల్స్ చూసి అబ్బ బాలయ్య నువ్వు సూపర్ అంటున్నారు నందమూరి అభిమానులు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*