మెగా, నందమూరి అభిమానులను కనువిందు చేస్తోన్న ఫోటో ఇదే…

ఈ ఏడాది స్టార్ హీరోల అభిమానులందరికి తమ హీరోలంతా కలిసిమెలిసి ఉండడం ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. ఎప్పుడూ ఒకరికొకరు దూరందూరంగా ఉండే హీరోలు ఇప్పుడు బాగా దగ్గరవడమే కాదు.. సందర్భం వచ్చినప్పుడల్లా… కలుస్తూ అందరి చూపులను తమ వైపు తిప్పుకుంటున్నారు. ఒక్క హీరో అనే కాదు… టాలీవుడ్ లో ఇప్పుడు స్టార్ హీరోలంతా కలిసిమెలిసి ఉంటూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రస్తుతం చరణ్, ఎన్టీఆర్ లు కలిసిమెలిసి తిరగడాన్ని మెగా, నందమూరి అభిమానులు పండగలా ఫిల్ అవుతున్నారు. ఇద్దరు కలిసి ఒక బిగ్ మల్టీస్టారర్ చెయ్యడమే కాదు.. పెళ్లిరోజు వేడుకలకి, పుట్టినరోజు వేడుకలకు ఫ్యామిలీస్ తో కలిసి సందడి చేస్తున్నారు. అలాగే వారు కలిసి తీయించుకున్న ఫొటోలు అయితే సోషల్ మీడియాలో ట్రేండింగ్ లోకొచ్చేస్తున్నాయి.

పైన ఎన్టీఆర్, కింద చరణ్….

ఇక ఎన్టీఆర్, రామ్ చరణ్ తరుచుగా కలుస్తున్నారు. స్నేహ భావమో.. పని లో భాగమో కానీ వీరు ఈ మధ్యన తెగ హడావిడి చేస్తున్నారు. రాజమౌళి సినిమా కోసం ఎక్కువగా కలిసి టైం స్పెండ్ చేస్తున్నారో ఏమో గాని ఒకరింటికి ఒకరు తెగ వెళుతున్నారు. అయితే తాజాగా రామ్ చరణ్ ఎన్టీఆర్ ఇంటికి వచ్చినప్పుడు చరణ్ అక్కడ సోఫాలో కూర్చుని బుగ్గమీద చెయ్యి పెట్టుకుని సుదీర్ఘాలచనలో ఉన్నాడు… అలాగే చరణ్ పైన గోడమీద సీనియర్ ఎన్టీఆర్ ఫోటో ఉంది. ఇక ఆ ఫోటో లో సీనియర్ ఎన్టీఆర్ బుగ్గ మీద వేలు పెట్టుకుని నవ్వుతున్నారు. ఆ ఫోటో.. చరణ్ బుగ్గమీద చెయ్యి పెట్టుకుని ఆలోచిస్తున్న ఫోజు ఒకేలా ఉన్నాయి… దీంతో జూనియర్ ఎన్టీఆర్… చరణ్ తో కలిసి తన తాత గారి ఫోటో ని తన సెల్ ఫోన్ లో బంధించాడు. మరి ఎన్టీఆర్ సరదాగా క్లిక్ మనిపించిన ఆ ఫోటో ని సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యడమే కాదు.. దానికింద ‘Provoked by LEGENDARY thoughts!’ (మహానుభావుల ఆలోచనల నుంచి ప్రేరణ) అనే క్యాప్షన్ పెట్టాడు.

హోరెత్తిస్తున్న అభిమానులు….

మరి ఎన్టీఆర్ పోస్ట్ చేసిన చరణ్ పిక్ ఇప్పుడు సామాజిక మద్యమాల్లో వైరల్ అయ్యింది. అటు చరణ్ అభిమానులు, ఇటు నందమూరి అభిమానులు ఎన్టీఆర్ పోస్ట్ చేసిన పిక్ ని లైక్ లు, షేరులతో హోరెత్తిస్తున్నారు. మరి ఫొటోలకే ఫాన్స్ కి ఇలా పిచ్చిపట్టేస్తుంటే… వారిద్దరూ కలిసి స్క్రీన్ మీద కనిపిస్తే ఇక వారి ఆనందాన్ని వర్ణించడం కష్టమే కదా. చరణ్, ఎన్టీఆర్ ల మల్టీస్టారర్ మూవీ ని రాజమౌళి వచ్చే అక్టోబర్ నుండి పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*