నందమూరి హీరోని చూసి షాకైన చిరు..!

సినిమాలపరంగా పోటీ ఉన్నా హీరోల మధ్య మాత్రం ఎంత సఖ్యత ఉంటుందో చాలాసార్లు చాలా విషయాల్లో గమనిస్తూనే ఉన్నాం. సీనియర్ హీరోల దగ్గర నుండి ఇప్పటి యువ హీరోల వరకు వారు పర్సనల్ గా చాలా సన్నిహితంగా మెలుగుతుంటారు. అక్కినేని, ఎన్టీఆర్, కృష్ణ సినిమాల విషయంలో పోటీ ఉన్నప్పటికీ.. బయట బాగుండేవారు. ఇక నాగార్జున, బాలకృష్ణ కాస్త ఎడముఖంగా పెడముఖంగా ఉన్నప్పటికీ.. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున అందరూ సఖ్యతగానే ఉంటారు. ఇక ఈ తరంలో మహేష్, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి హీరోలు మంచి రిలేషన్ మెయింటింగ్ చేస్తున్నారు. కాకపోతే అభిమానులే అప్పుడప్పుడు కాస్త చికాకు తెప్పిస్తారు.

ఆశ్చర్యపోయిన చిత్రబృందం

ఇకపోతే చిరంజీవి, బాలకృష్ణ స్పెషల్ అకేషన్స్ లో కలిస్తే ఆ సందడే వేరు. ఇక చిరంజీవి నటిస్తున్న సై రా నరసింహారెడ్డి సినిమా ఇండియాలోని పలు భాషల్లో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సై రా సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న చిరంజీవిని కలవడానికి బాలకృష్ణ హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతున్న సై రా మూవీ సెట్స్ కి వెళ్లాడు. ఇక సై రా సెట్స్ లో బాలకృష్ణ చిరుని సర్ ప్రైైజ్ చేశాడట. కేవలం చిరంజీవినే కాదు సై రా యూనిట్ మొత్తం బాలకృష్ణ రాకతో ఆశ్చర్యపోయారట. సై రా షూటింగ్ లో బిజీగా ఉన్న చిరంజీవిని, సై రా టీమ్ ను అభినందించిన బాలయ్య… సై రా నరసింహారెడ్డి సినిమా బాగా రావాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారట. నిన్నటికి నిన్న సై రా సెట్స్ లో పవన్ కళ్యాణ్ సందడి చేసిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ప్రస్తుతం చిరు, బాలయ్య ల మీటింగ్ న్యూస్ ఈ రోజు హైలెట్ అయ్యింది. కానీ సై రా సెట్స్ లో బాలయ్య ఉన్న ఫొటోస్ అయితే బయటికి రాలేదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1