ఒకే రోజు నందమూరి – మెగా కుటుంబాలకు పండగ రోజు..!

ఈ మధ్యన మెగా హీరో రామ్ చరణ్, నందమూరి హీరో ఎన్టీఆర్ లు బాగా క్లోజ్ గా ఉంటున్నారు. గతంలోనూ వారు ఫ్రెండ్స్ అయినప్పటికీ… ఈమధ్యన వారి ఫ్రెండ్షిప్ బహిర్గతమవుతుంది. ఒకరి బర్త్ డే కి ఒకరు కలవడం, ఒకరి పెళ్లిరోజుకి ఇంకొకరు వెళ్లడం ఇలా ప్రతి అకేషన్ కి రెండు ఫ్యామిలీస్ బాగా దగ్గరయ్యాయి. ఉపాసన కూడా ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతితో బాగా క్లోజ్ గా ఉండడం కూడా అటు ఎన్టీఆర్ ఇటు మెగా అభిమానులను సంతోషంలో పడేస్తుంది. అందులోనూ ఎన్టీఆర్, చరణ్ ఇద్దరూ రాజమౌళి మల్టీస్టారర్ లో భాగం కాబోతున్నారు కూడా. ఇప్పుడు నందమూరి, మెగా అభిమానులు మరో విషయంలో పండగ చేసుకుంటున్నారు.

ఒకే రోజు… రెండు విశేషాలు…

నిన్న అంటే జూన్ 14 న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కామినేని ఉపాసనని పెళ్లాడిన రోజు. అంటే వారి వివాహ వార్షోకోత్సవం . అయితే అదే రోజు జూనియర్ ఎన్టీఆర్, లక్ష్మి ప్రణతికి రెండో సంతానం కింద బాబు పుట్టాడు. నిన్న గురువారం ఎన్టీఆర్ కి బాబు పుట్టడంతో నందమూరి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఎన్టీఆర్ కి ఇది వరకే ఒక కొడుకు అభయ్ రామ్ ఉన్నాడు. మరి మెగా జంట వివాహ వార్షికోత్సవం, ఎన్టీఆర్ రెండో కొడుకు పుట్టిన రోజు ఒకే రోజు కావడంతో ఇద్దరి హీరోల అభిమానులు పిచ్చ హ్యాపీ గా వున్నారు.

సంబరాల్లో బిజీగా…

మరి దీన్ని బట్టి ఒకే రోజు నందమూరి, మెగా ఫ్యామిలీస్ లో పండగ రోజు రావడం మాత్రం అరుదైన విశేషంగా చెప్పుకోవచ్చు. ఇక మెగా జంట రామ్ చరణ్ – ఉపాసనలు పెళ్లి రోజు సెలెబ్రేషన్స్ లో బిజీగా ఉండగా… ఎన్టీఆర్ మాత్రం తన కొడుకు పుట్టిన రోజుని కేక్ కట్ చేసి మరి సెలెబ్రేట్ చేసుకున్నాడు. ఇంకా రెయిన్ బో హాస్పిటల్ లో తన బుల్లి టైగర్ ని చూడడానికి వెళ్లిన ఎన్టీఆర్ అక్కడి డాక్టర్స్ తో సెల్ఫీ దిగాడు. మరి ఒకే రోజు ఇద్దరు స్టార్ హీరోల ఫ్యామిలీస్ లో పండగ రోజు… వినడానికి బావుందండి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*