స్క్రిప్ట్ రైటర్ గా మారిన నాని..!

నాని

జెర్సీ సినిమా సక్సెస్ తో ఎంజాయ్ చేస్తున్న నాని తన నెక్స్ట్ మూవీపై దృష్టి పెట్టారు. ప్రస్తుతం అతను విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో ఓ విభిన్న కథ చేస్తున్నాడు. ఐదుగురు అమ్మాయిలకు గ్యాంగ్ లీడర్ గా ఉండే నాని ఈ సినిమా టైటిల్ కూడా గ్యాంగ్ లీడర్ అనే ఫిక్స్ చేసారు. మెగాస్టార్ చిరంజీవి సూపర్‌ హిట్ సినిమా ‘గ్యాంగ్ లీడర్’ టైటిల్‌ను తన సినిమా కోసం తీసుకున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సగం కంప్లీట్ అయింది.

దొంగగా కార్తికేయ…

ఇందులో నాని ఓ స్క్రిప్టు రైటర్ గా కనిపించనున్నారని తెలుస్తోంది. బ్యాంకు రాబరీతో మొదలయ్యే ఈ చిత్రంలో కరుడుగట్టిన దొంగగా ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ కనిపిస్తాడు. కార్తికేయనే కాకుండా మరో విలన్ కూడా ఉన్నాడట. నాని ఇప్పటివరకు చేయని ఓ విభిన్నమైన కథతో ఈ సినిమా రూపొందనుందని సమాచారం. ఇక ఈ చిత్రం టైటిల్ గ్యాంగ్ లీడర్ పై మెగా ఫ్యాన్స్ నుండి వ్యతిరేకత ఉన్న సంగతి తెలిసిందే.

Sandeep
About Sandeep 6914 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*