స్టార్ హీరోయిన్ సినిమాకి ప్రొడ్యుసర్ గా నాని..!

nani jercy movie copied from hollywood movie

గత ఏడాది “అ!” అనే డిఫరెంట్ సినిమాతో ప్రొడ్యూసర్ అవతారం ఎత్తి సక్సెస్ ని అందుకున్న హీరో నాని వరస సినిమాలతో బిజీ అయిపోవడంతో మళ్లీ ప్రొడ్యూస్ చేసే సినిమాల మీద ఫోకస్ చేయలేదు. అయితే రీసెంట్ గా నానికి ఒక సబ్జక్ట్ నచ్చడంతో ప్రొడ్యూస్ చేయాలని అనుకుంటున్నాడు. కొన్నిరోజులు కిందట స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ నాని దగ్గరకి ఒక లేడీ ఓరియెంటెడ్ కథ తీసుకొని వచ్చి ప్రొడ్యూస్ చేయమని కోరాడట.

సమంత అయితేనే సెట్ అవుతుందని…

కథ విన్న నాని వెంటనే ఓకే చేసాడని తెలుస్తుంది. అయితే ఆ కథలో సమంత మెయిన్ లీడ్ అని తెలుస్తుంది. సామ్ అయితేనే ఈ కథ బాగుంటుందని నాని విజేంద్ర ప్రసాద్ కి చెప్పాడట. అయితే ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరు అనేది మాత్రం క్లారిటీ లేదు. గతంలో నాని – సామ్ హీరోహీరోయిన్స్ గా నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి సమంత యాక్ట్ చేస్తుంటే నాని ప్రొడ్యూస్ చేయనున్నాడు. ప్రస్తుతం నాని ‘జెర్సీ’ అనే సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. దీని తరువాత విక్రమ్ కే కుమార్ తో ఓ సినిమా చేయనున్నాడు. సామ్ కూడా ‘మజిలీ’ అనే సినిమాలో నటిస్తుంది. దీని తరువాత నందిని రెడ్డి డైరెక్షన్ లో ఓ మూవీ చేయనుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*