నాని విషయంలో భలే జరుగుతుందిగా..!

hero nani rumers

కొన్నిసార్లు కొన్ని వింటుంటే… చూస్తుంటే చాలా తమాషాగా ఉంటాయి. కాకతాళీయంగా జరిగినా ఆ తర్వాత రిజల్ట్ బట్టి చూసుకుంటే అవును కదా అనేలా ఉంటాయి. అప్పుడప్పుడు కొన్ని ఆలా అనుకోకుండా జరిగిపోతాయి. అయితే నాని విషయంలో కూడా ఓ గమ్మత్తు జరిగింది. ‘ఫిదా’ లాంటి సూపర్ హిట్ సినిమాతో టాలీవుడ్ లో ఓ స్టాంప్ వేసుకున్న సాయి పల్లవి ఆ తర్వాత నానితో ‘ఎంసిఎ’ సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా..బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ మాత్రం బాగా వచ్చాయి.

అదే సెంటిమెట్ మళ్లీ వర్కవుట్..!

ఇక అలానే ‘గీత గోవిందం’ లాంటి బ్లాక్ బస్టర్ తో మంచి జోష్ మీద ఉన్న రష్మిక మందన్న ప్రస్తుతం నానితో ‘దేవదాస్’ లో హీరోయిన్ గా చేస్తుంది. ఇందులో నాగార్జున ఉన్నపటికీ ఆమె నానికి జోడి కాబట్టి సెంటిమెంట్ ప్రకారం ‘ఎంసిఎ’ లాగే ఇది కూడా హిట్ అవుతుందని లెక్కలు వేసుకుంటున్నారు అభిమానులు. రష్మిక మందన్నకు ‘దేవదాస్’ హిట్ అయితే కెరీర్ పరంగా పెద్ద బూస్ట్ అవుతుంది.

హ్యాట్రిక్ ఖాయమేనా..?

తెలుగులో తన కెరీర్ స్టార్టింగ్ లోనే ‘గీత గోవిందం’ లాంటి బ్లాక్ బస్టర్ ఉండటంతో ఆమెకు ఆఫర్స్ మీద ఆఫర్స్ వస్తున్నాయి. కానీ రష్మిక మాత్రం వచ్చిన అవకాశాలు అన్నీ చాలా జాగ్రత్తగా అలోచించి అడుగులు వేస్తుందంట. ప్రొడ్యూసర్స్ ఆమె అడిగినంత ఇవ్వడానికి కూడా రెడీ అయిపోయారంట. ‘ఛలో’, ‘గీత గోవిందం’ వరసగా రెండు సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో రశ్మికకు..సాయి పల్లవికి పోలిక రావడం సహజమే. ప్రస్తుతం ఆమె చేస్తున్న ‘దేవదాస్’ తో హ్యాట్రిక్ తన ఖాతాలో పడిపోతుంది అనే నమ్మకంతో ఉంది రష్మిక. ఒకవేళ సినిమా హిట్ అయితే మాత్రం ఆమె స్టార్ హీరోయిన్ స్థాయికి వెళుతుందన్న నమ్మకం అయితే అందరిలో ఉంది. ఈ సినిమా హిట్ అవ్వడం రష్మికకి కన్నా నానికి చాలా అవసరం. ఎందుకంటే నాని లేటెస్ట్ గా నటించిన ‘కృష్ణార్జున యుద్ధం’ డిజాస్టర్ అయింది. ఒకవేళ ఇది కూడా ప్లాఫ్ అయితే నాని పరిస్థితి కొంచం కష్టంగా మారే అవకాశముంది. ఎందుకంటే నాని ప్లేస్ ను ఆక్రమించడానికి హీరో విజయ్ నెమ్మదిగా వస్తున్నాడు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*