నాని 3 దశల్లో లో కనిపించనున్నాడు..!

హీరోలని మూడు దశల్లో చూడటం మనకి కోతేమి కాదు. ఎన్టీఆర్..ఏఎన్ఆర్ టైం నుండి మనం చూస్తున్నాం. కాకపోతే ఈ మధ్య కాలంలో హీరోస్ ని మూడు దశల్లో చూడటం చాలా తక్కువ సార్లు చూసాం. అయితే హీరో నాని తన నెక్స్ట్ మూవీలో 3 దశల్లో కనిపించబోతున్నాడు. ‘మళ్లీ రావా’ ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో జెర్సీ అనే సినిమాలో నాని హీరోగా చేయబోతున్న సంగతి తెలిసిందే.

40 ప్లస్ గా మారనున్న నాని

ఇందులో నాని తొలిసారిగా క్రికెటర్ గా కనిపించబోతున్నాడు. ఇందులో నాని 3 దశల్లో కనిపించనున్నాడు. టీనేజ్, యంగేజ్ తో పాటు 40ఏళ్లు దాటిన వ్యక్తిగా నాని చూపించనున్నాడు డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి. నానికి టీనేజ్, యంగేజ్ పాత్రలు చేయడం కొత్తేమీ కాదు. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ సినిమాలో టీనేజ్, యంగేజ్ పాత్ర చేసిన అనుభవం ఉంది.

త్వరలో సెట్స్ మీదకు…

కాకపోతే 40 ప్లస్ క్యారెక్టర్ మాత్రం ఇప్పటి వరకు చేయలేదు. ప్రస్తుతం ఈ పాత్ర పై రీసెర్చ్ మరియు రిహార్సిల్స్ చేస్తున్నాడు నాని. డైరెక్టర్ తో కలిసి ఆ పాత్ర ఎలా చేయాలో చేర్చిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*