శ్రీరెడ్డిపై నాని కౌంటర్ ఎటాక్…

తనపై శ్రీరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలపై హీరో నాని తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు శ్రీరెడ్డికి లీగల్ నోటీసులు పంపించారు. ఈ విషయాన్ని ‘ఓపికకు కూడా హద్దులు ఉంటాయి’ అని ట్విట్టర్ వేదికగా ఒక నోట్ పోస్ట్ చేశారు. ‘‘తాను ఈ రోతపై స్పందించని అందులోకి దిగజారను. వారికి కావల్సింది ఇవ్వను. ఇప్పటికే పరువు నష్టం దావా వేసి న్యాయపరమైన చర్యలు ప్రారంభించాను. కొందరు వ్యక్తులు సాఫ్ట్ గా ఉండేవారిని ఎంపిక చేసుకుని ఇలాంటి నిరాధార ఆరోపణలు చేసి రచ్చ చేసి డిస్టర్బ్ చేయాలనుకుంటారు. నా గురించి నాకు బెంగ లేదు. కానీ, మనం నివసిస్తున్న సమాజంపైనే నా బెంగ. కొందరు క్లిక్ ల కోసం, వ్యూ ల కోసం ఇటువంటివి ప్రచురిస్తున్నారు, అటువంటి వారు సిగ్గు పడాలి. అందరికీ కుటుంబాలు ఉన్నాయి. తాను తప్పక ఇప్పుడు చెప్పాల్సి వచ్చింది. ఇక నుంచి ఈ విషయంపై స్పందించను’’ అని నాని ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈ వ్యాఖ్యలకు శ్రీరెడ్డి కూడా స్పందించింది. న్యాయసరంగానే కొట్లాడుదామని తేల్చిచెప్పింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*