ఈ శుక్రవారం.. హడావిడి హాంఫట్

మొన్న శుక్రవారం టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేయడానికి నాలుగు సినిమాలు వచ్చాయి. అయితే అందులో రెండిటికి మాత్రమే ప్రేక్షుకులు ఎట్రాక్ట్ అయ్యారు. సుధీర్ బాబు, నభా నటేష్ కాంబోలో తెరకెక్కిన ‘నన్ను దోచుకుందువటే’ కు మొదటి రోజు నుండే పాజిటివ్ టాక్ రావడంతో సినిమా వసూల్ కూడా బాగుండే అవకాశం ఉందని చెబుతున్నారు. యూత్ ని ఎట్రాక్ట్ చేసే అంశాలు ఇందులో ఉన్నాయని..హీరో హీరోయిన్ ల కెమిస్ట్రీ వర్క్ అవుట్ అయిందని అర్ధం అవుతుంది. మరి ఇది ఏ రేంజ్ లో ఆడుతుందో సోమవారం తరువాత తేలుతుంది.

ఇక విక్రమ్ హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా రూపొందిన ‘సామీ’ పూర్తి నెగటివ్ టాక్ తో ప్రేక్షకులని నిరాశపరుచుతుంది. డైరెక్టర్ హరిపై అంచనాలు పెట్టుకుంటే నిరాశ పరిచారని సినిమా చాలా రెగ్యులర్ గా ఉందని చెబుతున్నారు. కోలీవుడ్ లో కూడా ఈసినిమా పరిస్థితి అలానే ఉంది. ఇక ఈ రెండిటితో పాటు రెండు చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో ఒకటి ఫైట్ మాస్టర్ విజయ్ కుమారుడు రాహుల్ విజయ్ హీరోగా రాము కొప్పుల దర్శకత్వంలో వచ్చిన ‘ఈ మాయ పేరేమిటో’. విజయ్ కొడుకు కాబట్టి ఇండస్ట్రీ నుండి మంచి సపోర్ట్ వచ్చినా అవి ఏమి సినిమాపై ప్రభావం చూపలేదు. ఇద్దరు ప్రేమలో పడటం, పెళ్లి దాకా వెళ్లడం, విడిపోయే పరిస్థితులు రావడం లాంటి రెగ్యులర్ గా తీయడమే కాకుండా దాన్ని సరైన రీతిలో తీయకపోవడం సినిమాకు మైనస్ అయింది. మొదటి సినిమాతోనే రాహుల్ విజయ్ పర్లేదు అనిపించుకున్నాడు.

ఈమూడు సినిమాలతో పాటు యాక్షన్ కింగ్ అర్జున్ మెయిన్ లీడ్ గా ‘కురుక్షేత్రం’ అనే సినిమా విడుదల అయింది. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈచిత్రం పర్లేదు అనిపించుకున్న సరైన ప్రొమోషన్స్ లేకపోవడంతో అసలు ఈసినిమా రిలీజ్ అయినా సంగతి కూడా ఎవరికి తెలియడం లేదు. మర్డర్ మిస్టరీ గా రూపొందిన ఈసినిమాలో ఒక శాడిస్ట్ ప్రముఖులను కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేస్తుంటాడు. వాడిని వెతికే ఆఫీసర్ పాత్రలో అర్జున్ కనిపిస్తాడు. అర్జున్ కి అసిస్టెంట్ గా ప్రసన్న, వరలక్ష్మి శరత్ కుమార్ నటించారు. ఇది కన్నడలో రెండేళ్ల క్రితమే రిలీజ్ అయింది. సో ఈనాలుగు సినిమాల్లో ‘నన్ను దోచుకుందువటే’ ఒక్కటే ప్రేక్షకుల మనసులు దోచుకుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*