ఆ సీన్ కు థియేటర్లు మార్మోగుతున్నాయి..!

నిన్న రిలీజ్ అయిన సుధీర్ బాబు `నన్ను దోచుకుందువటే` సినిమా థియేటర్స్ లో ప్రేక్షకులు క్లాప్స్ – విజిల్స్ తో థియేటర్లను మొత్తం మారుమోగిస్తున్నారు. సినిమా నచ్చి అనుకుంటున్నారా ? లేదండి.. సినిమాలో హీరోయిన్, హీరో మధ్య ఓ సీన్ ఉంటుంది. ఆ సీన్ కి థియేటర్స్ లో రెస్పాన్స్ మాములుగా లేదు. ఆ సీన్ కి అంతలా రియాక్ట్ అవ్వడానికి అందులో ఏముంది అనుకుంటున్నారా? ‘శ్రీమంతుడు’ సినిమాలో మహేష్ మొదటిసారి హీరోయిన్ ని చూసే సీన్ ఉంది కాదా.. అదేనండి శృతి హాసన్ బయట ముగ్గు వేస్తూ ఉంటే మనవాడు కార్ లో వెళ్తూ శృతిని చూసి ఫిదా అయిపోయి మళ్లీ మళ్లీ అదే ఇంటి చుట్టూ కార్ లో రౌండ్లు కొడుతూ శృతిని చూస్తూ వెళ్లే సీన్ ఉంది కదా..సేమ్ అదే సీన్ ను `నన్ను దోచుకుందువటే` సినిమాలో దింపారు.

సినిమాకి కూడా మంచి టాక్…

అయితే ఇక్కడ మహేష్ ప్లేస్ లో సుధీర్ ఉన్నాడు. శృతి ప్లేస్ లో హీరోయిన్ నభా నటేష్ ఉంది. అయితే మహేష్ కార్ లో వెళ్ళేటప్పుడు కార్ లో ఫామిలీ ఉంటుంది కాబట్టి డీసెంట్ గా శృతిని చూసి వెళ్లిపోతాడు. కానీ సుధీర్ కార్ లో సింగిల్ గా వెళ్తుంటాడు కాబట్టి డార్లింగ్ నభా నటేష్ కి కన్నుకొట్టి – ఫ్లైయింగ్ కిస్ ఇస్తాడు. మా అబ్బాయిని ఎప్పుడు కలిశావ్? అని హీరో నాన్న అడగ్గానే హీరోయిన్ నభా తన ప్రేమకథను వినిపించే సీన్ అది. సిచువేషన్ ఏదైనా సీన్ అయితే బాగా పండటమే కాదు థియేటర్స్ లో క్లాప్స్ – విజిల్స్ పడుతున్నాయి. ఓవరాల్ గా ఈ సినిమా కూడా మంచి టాక్ సంపాందించుకుంది. సినిమా బాగుందని టాక్ రావడంతో తొలి వీకెండ్ కలెక్షన్స్ బాగా వస్తాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సుధీర్ బాబు సొంత బ్యానర్ లో నిర్మించిన ఈ సినిమాకి ఆర్.ఎస్.నాయుడు దర్శకత్వం తొలి ప్రయత్నం ఫిలించినట్టే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*