@నర్తనశాలకు మంచి డిమాండే ఉంది!

naga shourya next movie

కృష్ణ వంశీ శిష్యుడు శ్రీనివాస చక్రవర్తి దర్శకత్వంలో ఛలోతో ఫామ్ లోకి వచ్చిన నాగ శౌర్య తన సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ లో @నర్తనశాల సినిమా చేశాడు. @నర్తనశాల రేపు గురువారమే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 15 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా మీద ట్రేడ్ లో, ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. నాగ శౌర్య గే గా కనబడనున్న ఈ సినిమాలో ప్రియా వడ్లమాని, యామిని భాస్కర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఛలో చిన్న సినిమాగా తెరకెక్కి మంచి కలెక్షన్స్ తో ఐరా క్రియేషన్స్ కి లాభాలు తెచ్చి పెట్టడంతో… @నర్తనశాల కు కూడా అదే రకమైన అంచనాలు ఉండడంతో.. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరిగిందనే టాక్ ఉంది.

మూడున్నర కోట్లకు…

అయితే ఛలో సినిమాకి ఉన్న క్రేజ్ తో @నర్తనశాల శాటిలైట్ రైట్స్ కి మంచి ధర వచ్చినట్టుగా తెలుస్తుంది. కేవలం శాటిలైట్స్ హక్కుల కే కాకుండా ఆ సినిమా డిజిటల్ హక్కులకు కూడా మంచి రేటు వచ్చినట్లుగా తెలుస్తుంది. ఛలో సినిమా శాటిలైట్స్ హక్కులు, డిజిటల్ హక్కులు కలిపి ఒక్కరికే రెండున్నర కోట్లకి అమ్మిన ఐరా క్రియేషన్స్ వారు… ఇప్పుడు @నర్తనశాల డిజిటల్ హక్కులను అమెజాన్ వారికీ, శాటిలైట్ హక్కులను మా ఛానల్ కి అమ్మినట్లుగా వార్తలొస్తున్నాయి. అయితే శాటిలైట్, డిజిటల్ హక్కులకి కలిపి మూడున్నర కోట్లు వచ్చినట్లుగా తెలుస్తుంది.

గీత గోవిందం ముందు నిలుస్తుందా…

ఛలో సినిమాకి రెండున్నర కోట్లు వస్తే… @నర్తనశాల సినిమాకి మాత్రం మరో కోటి అదనంగా అంటే మూడున్నర కోట్లు వచ్చాయన్నమాట. మరి సినిమా హిట్ అయ్యిందా… లాభాలే లాభాలు. కానీ టాక్ తేడా కొట్టిందా.. గీత గోవిందం అనే సుడి గుండంలో మిగతా సినిమాల వలె నాగ శౌర్య @నర్తనశాల కొట్టుకుపోవడం ఖాయమంటున్నారు. చూద్దాం ఈ గురువారం @నర్తనశాల జాతకం ఎలా ఉందొ తెలిసిపోతుంది.

Sandeep
About Sandeep 6914 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*