‘న‌ర్త‌న శాల‌’ ప్రమోషన్స్ కి ఇంత ఖర్చా..?

నాగ‌శౌర్య తండ్రి శంక‌ర్ ప్ర‌సాద్‌ తన సొంత బ్యానర్ లో ఐరా క్రియేష‌న్స్‌ లో తన కొడుకుతో ‘ఛ‌లో’ అనే సినిమాను నిర్మించారు. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి మంచి కలెక్షన్స్ తెచ్చిపెట్టింది. ఆ సినిమా అంతలా హిట్ అవ్వడానికి ప్రమోషన్స్ మేజర్ కారణం. కచ్చితంగా శౌర్యకి హిట్ అవసరం అన్న టైంలో ఆ బ్యానర్ లో ‘ఛలో’ వచ్చింది. మళ్లీ ఇప్పుడు అదే బ్యానర్ లో ‘న‌ర్త‌న‌శాల‌’ వస్తుంది.

గత సినిమాల అనుభవంతో…

దీనికి కూడా ఈసారి ప్రొమోషన్స్ విషయం ఇది వ‌ర‌కెప్పుడూ లేనంత జోరుగా సాగుతున్నాయి. ఎందుకంటే శౌర్య లేటెస్ట్ మూవీస్ ‘అమ్మ‌మ్మ‌గారి ఇల్లు’, ‘క‌ణం’ ప్ర‌మోష‌న్లు లేక డీలా ప‌డ్డాయి. ‘అమ్మ‌మ్మ‌గారి ఇల్లు’ కి మంచి టాక్ వచ్చినా మూవీకి పబ్లిసిటీ లేకపోవడంతో సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద నిల‌బ‌డ‌లేక‌పోయింది. సో ఆ లోటు.. ‘న‌ర్త‌న శాల‌’కు రాకూడ‌ద‌ని జాగ్ర‌త్త‌ ప‌డుతున్నారు. ఇప్పటికే ప్ర‌మోష‌న్ల కోసం ఏకంగా రూ.3.5 కోట్లు ఖ‌ర్చు పెట్టినట్టు తెలుస్తోంది. స్టార్ హీరోస్ కి ఏ స్థాయిలో ప్రమోట్ చేస్తారో అదేవిధంగా ఈ సినిమాకు చేశారు. రీసెంట్ గా రిలీజ్ అయినా టీజ‌ర్ల‌కు, పాట‌ల‌కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై హోప్స్ పెరిగిపోయాయి. ‘శైలజ రెడ్డి అల్లడు’కి పోటీగా ‘న‌ర్త‌న శాల‌’ను ఈనెల 30న విడుదల చేయనున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*