నర్తనశాల కు బాగా కలిసొస్తుందే..!

ఆగస్టు 30న నాగ శౌర్య హీరోగా నటించిన ‘@నర్తనశాల’ సినిమా నిన్న సెన్సార్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకుని యు/ఎ సర్టిఫికెట్ తో బయటికి వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా మీద ఫిలింనగర్ సర్కిల్స్ లో మంచి క్రేజ్ ఉంది. నాగ శౌర్యతో పాటు టీం కూడా ఈ సినిమా హిట్ అవుతుందని పూర్తి నమ్మకంతో ఉంది. నాగ శౌర్య ‘గే’ గా నటిస్తున్న ఈ సినిమాని ఐర క్రియేషన్స్ వారు అంటే నాగ శౌర్య స్వంత బ్యానర్ నిర్మిస్తుంది. అయితే ఆ తర్వాతి రోజు అంటే నర్తనశాల విడుదల నెక్స్ట్ డే విడుదల కావాల్సిన నాగ చైతన్య సినిమా శైలజారెడ్డి అల్లుడు… కేరళ వరదలు, అలాగే గీత గోవిందం ఎఫెక్ట్, @నర్తనశాల ప్రభావంతో రెండు వారాల వెన్నక్కి వెళ్లిపోయింది. దాంతో నాగ శౌర్య సినిమాకు ఆ రకంగా కూడా చాలా కలిసొచ్చింది.

పేపర్ బాయ్ పోటీ ఇచ్చేనా..?

ఇంత పాజిటివ్ వైబ్స్ వస్తున్న, అలాగే ప్రమోషన్స్ కూడా ఒక రేంజ్ లో చేపడుతున్న ఈ చిత్రం మరి ఏ రేంజ్ లో ప్రేక్షకులని ఆకట్టుకుందో చూడాలి. ఇకపోతే ఇప్పుడు నాగ శౌర్య @నర్తనశాలకి పేపర్ బాయ్ కొద్దిగా కాంపిటీటర్ గానే కనబడుతుంది. సంపత్ నంది టీమ్ వర్క్స్ లో సంతోష్ శోభన్ హీరోగా నటించిన పేపర్ బాయ్ మీద కూడా మంచి అంచనాలున్నాయి. ఎందుకంటే ప్రమోషన్స్ లో పీక్స్ లో ఉన్న పేపర్ బాయ్ @నర్తనశాల చిన్నగా పోటీ ఇచ్చేలాగా కనబడుతుంది.

Sandeep
About Sandeep 6914 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*