నాగ శౌర్య నర్తనశాల కథ ఇదే..!

నాగశౌర్య తన ఓన్ బ్యానర్ ఐరా క్రియేషన్స్ లో నర్తనశాల సినిమాని కృష్ణ వంశీ శిష్యుడు శ్రీనివాస్ చక్రవర్తి డైరెక్షన్ లో చేస్తున్నాడు. ఈ నెలాఖరున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై ట్రేడ్ లో, ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. మొన్నామధ్యన నర్తనశాల ప్రమోషన్స్ లో భాగంగా నర్తనశాల టీమ్ ఆ సినిమా టీజర్ ని వదిలింది. టీజర్ లో మోడరన్ బృహన్నలా అంటె గే లా నాగ శౌర్య అదరగొట్టాడు. అయితే సినిమాలో నాగ శౌర్య ఎంతసేపు బృహన్నలా కనిపిస్తాడు.. అలా ఎక్కువసేపు కనిపిస్తే నాగ శౌర్య ఇమేజ్ దెబ్బతింటుంది.. అంటూ ఫిలింసర్కిల్స్ లో హాట్ హాట్ చర్చలే జరిగాయి.

పాత నర్తనశాల లానే…

ఇక ఈ సినిమా కథ ఎలా ఉండబోతుంది.. అసలెందుకు ఈ సినిమా లో నాగ శౌర్య బృహన్నల లా కనిపిస్తున్నాడు అంటూ.. హాట్ హాట్ చర్చలు జరుగుతున్న వేళ నర్తనశాల సినిమా కథ ఇదే అంటూ ఒక న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. గతంలో వచ్చిన నర్తనశాలలో అర్జునుడు కావాలనే బృహన్నలగా మారడం… అజ్ఞాతవాసంలో భాగంగా అర్జునుడు అలా మారాల్సి రావడం ఆ సినిమాలో చూపించారు. మరి ఇప్పుడు ఈనాటి నర్తనశాలలో నాగ శౌర్య తాను ప్రేమించిన అమ్మాయి కోసం బృహన్నలా మారడం… అలా బృహన్నలాగా మారిన నాగ శౌర్య.. హీరోయిన్ ఇంట్లోకి రావడం… హీరోయిన్ కుటుంబానికి బుద్ది చెప్పి మరీ ఆమెని అక్కడినుండి బయటికి తీసుకురావడం అనే కాన్సెప్ట్ మీదే నర్తనశాల కథ ఉండబోతుందట.

చైతూ సినిమా పోస్ట్ పోన్ అవడంతో…

బ్రహన్నలాగా యాక్ట్ చేస్తూనే విలన్స్ తో యాక్షన్ సన్నివేశాల్లో ఇరగదీసే క్యారెక్టర్ లో నాగ శౌర్య ఆదరగొట్టాడని చెబుతున్నారు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఈ నెల 24న జరిపి సినిమాని ఈ నెల 30న విడుదల చెయ్యడానికి ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. అయితే నాగ శౌర్య కి పోటీగా దిగుదామనుకున్న నాగ చైతన్య శైలజారెడ్డి అల్లుడు సినిమా విడుదల పోస్ట్ పోన్ అవడంతో… అది కాస్తా నాగ శౌర్య నర్తనశాలకి కలిసొస్తుంది. మరి సోలోగా దిగి సూపర్ హిట్ కొట్టెయ్యాలనే కసితో ఇప్పుడు నాగ శౌర్య కనబడుతున్నాడు.