డిజాస్టర్ అవ్వడానికి కారణం శౌర్యనే!

తన సక్సెస్ కు తానే కారణం… తన ఫెయిల్యూర్ కి తానే కారణం అయ్యాడు యంగ్ హీరో నాగశౌర్య. రీసెంట్ గా అతను నటించిన ‘ఛలో’ సినిమా తన సక్సెస్ అని తానే రాసుకున్నాడు. ఆ చిత్రంతో నాగశౌర్య మంచి పేరుతో పాటు మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. దాంతో నాగశౌర్యకు మంచి స్టోరీ సెలక్షన్ ఉందని చాలామంది మెచ్చుకున్నారు.

అవి ఫ్లాపయ్యి……

ఆ తర్వాత సినిమా చేసిన ‘కణం’, ‘అమ్మమ్మగారిల్లు’ చిత్రాలు విడుదలై ఫ్లాపయ్యాయి. వాటిపై నమ్మకం ఉన్న లేకున్నా తాను నటించిన సినిమాలు కాబట్టి తనవంతుగా వాటిని ప్రమోట్‌ చేయాలి. కానీ నాగశౌర్య ఏవో కారణాలు చెప్పి వాటిని ప్రమోట్ కూడా చేయలేదు. దాంతో అవి అట్టర్ ప్లాప్స్ అయ్యాయి.

డిజాస్టర్ కావడంతో…..

ఇక మొన్న రిలీజ్ అయినా ‘నర్తనశాల’ చిత్రాన్ని స్వీయ నిర్మాణంలో తీసాడు. ఈసారి కూడా కొత్త దర్శకుడుకి ఛాన్స్ ఇచ్చి అతనితో సినిమా చేశాడు. ప్రొమోషన్స్ కూడా పర్లేదు అనిపించుకున్నాడు కానీ అది కూడా డిజాస్టర్ అయింది. ఈసినిమాను చూసిన ప్రతి ప్రేక్షకుడు ఛలోతో వచ్చిన గుడ్‌విల్‌ మొత్తం ఈ చిత్రంతో పాడు చేసుకున్నాడు అని అంటున్నారు. ఇది ప్లాప్ అవ్వడానికి కారణం నాగశౌర్య ప్లానింగే అని అంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*