నయన్ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది!

తమిళ లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలంటే క్రేజ్తో పాటు కాంఫిడెన్స్ కూడా ఉంటాయి. ఆమె పట్టిందల్లా బంగారం అన్నట్టు ఆమె ఏ సినిమా చేసిన సూపర్ హిట్ అవుతున్నాయి. ఆమె స్టోరీ సెలక్షన్ చాలా బాగుంటది. ఆమెను తమ దృష్టిలో ఉంచుకునే చాలామంది డైరెక్టర్స్ కథలు రాస్తుంటారు. అందుకు తగ్గట్టుగానే ఆమె పెర్ఫామెన్స్ కూడా ఉంటుంది.

అటు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో…ఇటు హీరో పక్క హీరోయిన్ పాత్రలు వేసిన ఆమె పాత్రకు ప్రాధ్యాన్యత ఉంటుంది. రీసెంట్ గా ఆమె నటించిన ‘మయూరి’.. ‘కర్తవ్యం’ లాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలు నయన ఇమేజ్‌ ను ఎంతో పెంచాయి. ఇక రెండు రోజుల కిందట తమిళనాడులో నయనతార ‘కోలమావు కోకిల’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాకు రిలీజ్ అయినా ప్రతి చోట అద్భుతమైన స్పందన లభిస్తోంది.

ఈ సినిమాను క్రిటిక్స్ సైతం మెచ్చుకుంటున్నారు. ప్రేక్షకులు కూడా సినిమాని ఆదరిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. కామెడీ ఎంటర్టైనర్ గా సాగే ఈ కథలో నయన్ పాత్ర చాలా బాగుంది అంటున్నారు. ఈమూవీలో కమెడియన్ యోగిబాబు నయనతారను ప్రేమించే వ్యక్తిగా నటించాడు. నయన్..యోగిబాబు వచ్చే సీన్స్ సినిమాకే హైలైట్ అంట. తమిళలో పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ఈసినిమాను తెలుగులో త్వరలో రిలీజ్ చేయనున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1